Heavy Rain: టెనెసీలో వినాశనం.. ఒకే రోజు 43 సెంటీమీటర్ల వర్షం

అమెరికాలో కుండపోత వర్షాలు వినాశనం సృష్టించాయి. టెనెసీ రాష్ట్రాన్ని గత

Published : 24 Aug 2021 12:04 IST

వేవర్లీ: అమెరికాలో కుండపోత వర్షాలు వినాశనం సృష్టించాయి. టెనెసీ రాష్ట్రాన్ని గత రెండు రోజులుగా విలయంలా ముంచెత్తాయి. ఇక్కడి హంప్రేస్‌ కౌంటీలో 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకస్మాత్తు వరదల్లో మృతిచెందిన వారి సంఖ్య సోమవారానికి 22కు చేరింది. పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. వరద నుంచి బయటపడే క్రమంలో ఓ తండ్రి భుజాలపై ఎక్కించుకున్న 7 నెలల కవల పిల్లలు కొట్టుకుపోవడం కలిచివేసింది. వందలాది ఇళ్లు కూలిపోయాయి.

న్యూయార్క్‌కు తప్పిన ముప్పు

అమెరికాలో పలు రాష్ట్రాలను బెంబేలెత్తించిన హెన్రీ తుపాను బలహీనపడింది. ఈశాన్య దిశలోనే కేంద్రీకృతమై, మసాసుసెట్స్‌ వైపు మళ్లడంతో న్యూయార్క్‌ ఊపిరి పీల్చుకుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని