పేదల కోసం గరిట తిప్పిన బైడెన్, హారిస్‌

అమెరికా అధ్యక్ష భవనానికి క్రిస్మస్‌ చెట్టు రాకతో అగ్రరాజ్యంలో హాలిడే సీజన్‌ ఆరంభమైంది. 

Published : 25 Nov 2021 12:35 IST

అమెరికా అధ్యక్ష భవనానికి క్రిస్మస్‌ చెట్టు రాకతో అగ్రరాజ్యంలో హాలిడే సీజన్‌ ఆరంభమైంది. ప్రథమ పౌరురాలు జిల్‌ బైడెన్‌ సోమవారమే దీన్ని అధికారికంగా ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం నాన్టుకెట్‌ ద్వీపానికి చేరుకున్న అధ్యక్షుడు బైడెన్‌... ప్రస్తుతం అక్కడున్న తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త డేవిడ్‌ రూబెన్‌స్టీన్‌ ఇంట్లో బస చేస్తున్నారు. ఆదివారం తిరిగి శ్వేతసౌధం చేరుకుంటారు. వాషింగ్టన్‌ నుంచి బయల్దేరి వెళ్లడానికి ముందు బైడెన్‌ దంపతులు, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దంపతులు పేదల కోసం ‘డీసీ సెంట్రల్‌ కిచెన్‌’లో వంటలు వండి, వడ్డించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు