గల్ఫ్ దేశాల్లో ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు

తెలుగు దేశం జి.సి.సి ఆధ్వర్యంలో కువైట్, సౌదీ అరేబియా,

Updated : 26 Mar 2022 15:05 IST

తెలుగు దేశం జి.సి.సి ఆధ్వర్యంలో కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, ఓమన్, బహ్రెయిన్‌, దుబాయి, అబుదాబి, షార్జా, రాస్ అల్-ఖైమా, ఫుజైరాహ్ ప్రాంతాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 25 నుంచి 29వ తేదీ వరకూ జరిగే ఈ వేడుకల కోసం అన్ని ఎర్పాట్లు చేశారు. ఖతార్‌ వేడుకల్లో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాలన్నీ ఈ మధ్యే ప్రకటించిన ఎన్నారై తెదేపా కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెదేపా కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లోని తెలుగుదేశం అభిమానులందరూ ఆయా ప్రాంతాల్లో జరగనున్న వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని