ATA: ఎన్టీఆర్ పాత్రలు ధరించి.. ఘనంగా నీరాజనం
ఒకే వేదికపై 20 మంది ఎన్టీఆర్‌లు.. వివిధ వేషధారణల్లో ఒకేసారి కదలివస్తే చూసేవారికి కన్నుల పండుగే కదా..! అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని ఘనంగా నిర్వహించిన ఆయన అభిమానులు అలాంటి
ఆటా మహాసభల్లో అట్టహాసంగా తారకరాముడి శతజయంత్యుత్సవాలు
ఈనాడు, అమరావతి: ఒకే వేదికపై 20 మంది ఎన్టీఆర్‌లు.. వివిధ వేషధారణల్లో ఒకేసారి కదలివస్తే చూసేవారికి కన్నుల పండుగే కదా..! అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని ఘనంగా నిర్వహించిన ఆయన అభిమానులు అలాంటి అద్భుతాన్నే ఆవిష్కరించారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు వాషింగ్టన్ డీసీలో ఈ నెల 1 నుంచి మూడో తేదీ వరకు ఘనంగా జరిగాయి. మూడో రోజు ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల్ని అట్టహాసంగా నిర్వహించారు. ఆయన సినీ, రాజకీయ ప్రస్థానానికి అద్దం పట్టేలా ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. ‘వంద ఏళ్ల పండుగకు వందనాలు అందుకో.. వందల తరములకైనా... అందరు ఆనందమొందు సుందర గంభీర రూపమా’ అంటూ ఎన్టీఆర్ గొప్పతనాన్ని కీర్తిస్తూ పలువురు యువతులు శాస్త్రీయ నృత్యాభినయంతో ఆయనకు నీరాజనాలు పట్టడంతో నృత్య రూపకం మొదలైంది. ఎన్టీఆర్ నవరసాల్ని వేదికపై ప్రదర్శించేలా మూల్పూరి వెంకట్రావు తెలుగువారితో మాట్లాడి చక్కటి పాట రాయించారు. ఆ పాటకు లక్ష్మీకాంత రాపర్ల చక్కటి నృత్యరీతుల్ని సమకూర్చారు.
వేదికపై ఏర్పాటు చేసిన భారీ తెరపై ఎన్టీఆర్ వివిధ సినిమాల్లో పోషించిన పాత్రల చిత్రాలు ప్రదర్శితమవుతుండగా ఆ కళాకారిణులు చేసిన నృత్యం ఆహూతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరో గీతానికి కళాకారిణులు నృత్యం చేస్తుండగానే.. ఎన్టీఆర్ ధరించిన పలు పాత్రల వేషధారణల్లో ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చారు. గుండమ్మ కథలో ఎన్టీఆర్ వేషధారణలో, బృహన్నల, భీష్ముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు వంటి పౌరాణిక పాత్రల్లో, కొండవీటి సింహం తదితర సాంఘిక సినిమాల్లో ఎన్టీఆర్ ధరించిన వేషధారణలతో ప్రవాసాంధ్రులు వేదికపైకి వచ్చి హావభావాలతో మెప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: హడలెత్తించిన నేపాల్.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
-
NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’