ఫిన్లాండ్‌ తెలుగు సాంస్కృతిక సంఘం నూతన అధ్యక్షురాలిగా శ్రీవల్లి అడబాల

ఫిన్లాండ్‌ తెలుగు సాంస్కృతిక సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షురాలిగా శ్రీవల్లి అడబాల ఎన్నికయ్యారు.

Published : 30 Mar 2023 15:10 IST

హెల్సింకి: ఫిన్లాండ్‌లో నివసించే తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్థాపించిన  ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కొత్త ప్రెసిడెంట్‌గా శ్రీవల్లి అడబాల ఎన్నికయ్యారు.  2015లో ప్రారంభమైన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ అక్కడి తెలుగువారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది.  ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా జీవించే ప్రజలు కలిగిన దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచే ఫిన్లాండ్‌ తెలుగు సాంస్కృతిక సంఘానికి ఒక మహిళ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం గర్వకారణం.  అలాగే, సంఘం ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ కంచెర్ల, కార్యదర్శిగా రోజా రమణి మొలుపోజు, కోశాధికారిగా లక్ష్మీ తులసి పునగంటి, తెలుగు మనబడి ప్రోగ్రాం సమన్వయకర్తగా గోపాల్ పెద్దింటి, కమిటీ సభ్యులుగా ప్రతాప్ కుమార్ గార, అభిలాష్‌ పెద్దింటి, గాయత్రి దశిక, కృష్ణ కొమండూరు, కిరణ్మయి గజ్జెల, రమణారెడ్డి కరుమూరు, సత్యసాయి బాబు పగడాల, సుభాష్ బొగాడి ఎన్నికయ్యారు.  నూతన కార్యవర్గం ఈ నెల 25న ఉగాది, శ్రీరామనవమి వేడుకలను విజయవంతంగా నిర్వహించింది. మున్ముందు మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ తెలుగువారికి మరింత చేరువగా ఉంటామని నూతన అధ్యక్షురాలు శ్రీవల్లి అడబాల ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు