డాలస్‌లో జూన్‌ 30 నుంచి నాటా మహాసభలు

అమెరికాలోని డాలస్‌ నగరంలో జూన్‌ 30 నుంచి జులై 2వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated : 14 May 2023 05:25 IST

ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని డాలస్‌ నగరంలో జూన్‌ 30 నుంచి జులై 2వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మహాసభల్లో తెలుగు సంప్రదాయాలను, కళలను అపూర్వమైన స్థాయిలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నాటా అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, కాబోయే అధ్యక్షుడు హరి వేల్కూర్‌, పూర్వాధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి గండ్ర నారాయణరెడ్డి, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి దర్గారెడ్డి తెలిపారు. అందులో భాగంగా సినీ ప్రముఖులు రామ్‌గోపాల్‌వర్మ, మేర్లపాక గాంధీ, శ్రీనివాసరెడ్డి, అలీ, లయ గోర్తి, పూజ ఝువాల్కర్‌, స్పందన పల్లి, అనసూయ, ఉదయభాను, రవి, రోషన్‌, రవళి తదితర ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. టాలీవుడ్‌ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్‌, తమన్‌, అనూప్‌ రూబెన్స్‌ బృందాలతో సంగీత విభావరి ఏర్పాటు చేశామన్నారు. ప్రముఖ దుస్తుల డిజైనర్‌ శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌షో, సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్‌ పర్యవేక్షణలో పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. మహాసభల ఏర్పాట్లను నాటా కార్యవర్గ సభ్యులు ఆర్య బొమ్మినేని, జయ తెలక్‌, మాధవి లోకిరెడ్డి, నంద కొర్వి, రేఖ కరణం, సుప్రియ టంగుటూరి, బ్రహ్మ బీరివెరా, హరి సూరిశెట్టి, సతీష్‌ సీరం, సలహాదారులు హరి వేల్కూర్‌, రామిరెడ్డి ఆళ్ల, ఉషారాణి చింత, సుజాత వెంపరాల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు నాటా వెబ్‌సైట్‌ https://nataconventions.org/conference-registration.php లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని