విక్టోరియా పార్లమెంటులో ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ఎన్టీయార్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా పార్లమెంటులో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు.

Updated : 07 Jun 2023 05:15 IST

ఈనాడు, అమరావతి: ఎన్టీయార్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా పార్లమెంటులో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నందమూరి వసుంధర, తేజస్వినితోపాటు పలువురు తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. కేబినెట్‌ కార్యదర్శి స్టీవ్‌ మెగ్చీ వారికి ప్రత్యేక జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సేవలను ఆయన కొనియాడారు. ప్రభుత్వ ప్రీమియర్‌ ఆధ్వర్యంలో ప్రశంసాపత్రాన్ని అందించనున్నట్లు తెలిపారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించి నందమూరి వసుంధరకు అక్కడి ప్రభుత్వ ముఖ్యఅధికారి లీ తర్లామిస్‌ పార్లమెంటు తరపున సేవల గుర్తింపు అవార్డును అందించారు. కార్యక్రమంలో అధికారపార్టీ ప్రతినిధులు, ఎంపీలతోపాటు ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు.

ఘనంగా మహానాడు: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరంలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలతోపాటు మహానాడు ఘనంగా నిర్వహించారు. నందమూరి వసుంధర, తేజస్విని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డోల్‌ బృందం వారికి స్వాగతం పలికింది. ఎన్టీఆర్‌ నటించిన పలు పౌరాణిక చిత్రాల్లోని పాత్రలను గుర్తు చేసేలా చిన్నారులు ప్రదర్శించిన కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని