సింగపూర్‌లో వైభవంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూర్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా జరిగింది. ఈ వ్రతంలో సింగపూర్‌లో ఉన్న 75మంది  తెలుగు దంపతులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని నోచుకొన్నారు.

Published : 29 Oct 2023 20:11 IST

సింగపూర్‌: కాకతీయ సాంస్కృతిక పరివారం సింగపూర్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కన్నుల పండుగగా జరిగింది. ఈ వ్రతంలో సింగపూర్‌లో ఉన్న 75మంది  తెలుగు దంపతులు పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని నోచుకొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు వ్రతం చేసుకోవడానికి కావాల్సిన పూజా ద్రవ్యాలు, స్వామి వారి రూపు, పటం భక్తులకు అందించారు. ఈ వ్రతానికి దాదాపు 400మంది ప్రత్యక్షంగా తిలకించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. వ్రతం సింగపూర్ శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయ ప్రాంగణంలో పీజీపీ హాలులో శనివారం (అక్టోబర్‌ 28) నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించిన సంస్థ సభ్యులకు, నిర్వహణలో సహకరించిన వాలంటీర్లు, అన్నదానానికి సాయం చేసిన దాతలందరికీ కాకతీయ పరివారం కార్యనిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని