OVA: అట్టహాసంగా ఓవర్సీస్ వెలమ అసోసియేషన్ వెబ్‌సైట్‌ లాంచ్‌

ఓవర్సీస్ వెలమ అసోసియేషన్ (OVA) తమ వెబ్‌సైట్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. హైదరాబాద్‌లో శుక్రవారం 24 దేశాల ప్రతినిధులు ప్రాతినిథ్యం వహించిన సభలో........

Published : 30 Jul 2022 19:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఓవర్సీస్ వెలమ అసోసియేషన్ (OVA) తమ వెబ్‌సైట్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. హైదరాబాద్‌లో శుక్రవారం 24 దేశాల ప్రతినిధులు ప్రాతినిథ్యం వహించిన సభలో https://overseasvelama.org/ పేరుతో ఓవర్సీస్‌ వెలమ సంఘం తమ వెబ్‌సైట్‌ను ఘనంగా లాంచ్‌ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న వెలమ సంఘం సంక్షేమం, ప్రయోజనాల కోసం ఓవీఏ సంస్థను 2019లో స్థాపించారు. ఇది లాభాపేక్షలేని సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెలమ సమాజాన్ని ఏకీకృతం చేయడం ఓవీఏ ప్రధాన లక్ష్యం. కమ్యూనిటీ కార్యకలాపాలను ప్రోత్సహించడం, నెట్‌వర్కింగ్, విద్యార్థుల సహాయం, వెలమ వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆసియా, ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లోని 24 దేశాల్లో ఓవీఏ సభ్యులు ఉన్నారు. నర్సింగారావు (ఆస్ట్రేలియా), రమేశ్‌ గుడపూరి (అమెరికా), శ్రీచరణ్ మరునేని (అమెరికా), సీహెచ్‌.లక్ష్మీనరసింహారావు (భారత్‌), మాధవ్‌రావు కటికనేని (భారత్‌), కల్యాణ్‌రావు కుసుగంటి (న్యూజిలాండ్‌) దీని వ్యవస్థాపకులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని