Akhanda: ఓవర్సీస్‌లో ‘అఖండ’ జోరు.. ఎంత కలెక్ట్‌ చేసిందంటే?

బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను ‘అఖండ’ అమాంతం పెంచేసింది. విడుదలైన తొలిరోజు నుంచే తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది.

Published : 10 Dec 2021 22:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్‌ను ‘అఖండ’ చిత్రం అమాంతం పెంచేసింది. విడుదలైన తొలిరోజు నుంచే తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. 2021 సంవత్సరానికి సంబంధించి ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు (గ్రాస్‌) సాధించిన చిత్రంగా నిలిచింది. వారంలో రూ. 10.08 కోట్లు కలెక్ట్‌ చేసినట్టు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. యూఎస్‌లో రూ.6.68 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.1.26 కోట్లు, యూకేలో రూ.0.72 కోట్లు, యురప్‌లో రూ.0.15 కోట్లు, గల్ఫ్‌లో రూ.0.80 కోట్లు, కెనడాలో రూ.0.25 కోట్లు, సింగపూర్‌లో రూ.0.13 కోట్లు, మలేషియాలో రూ.0.04 కోట్లు; సౌత్‌ ఆఫ్రికా, జాంబియా, టాంజానియా, జపాన్‌ కలపి రూ.0.05 కోట్లు వసూలు చేసింది. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. ప్రజ్ఞా జైస్వాల్‌ కథానాయిక. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని