Chandrababu: కుప్పంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు

చిత్తూరు జిల్లా కుప్పం నియోజవకర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది.

Updated : 30 Dec 2023 17:32 IST

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవకర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి బస్టాండ్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.

‘‘ప్రజల ఉత్సాహం చూస్తుంటే వైకాపాను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని ఉత్సాహాన్ని చూస్తున్నా. 35 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా. గ్రానైట్‌ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పార్క్‌ ఏర్పాటు చేస్తాం. లక్ష మెజారిటీ ఇచ్చి కుప్పం స్థాయిని మరోసారి చాటిచెప్పండి. రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలి. వైకాపా నేతలు హద్దుమీరి అరాచకాలు చేశారు. సైకోతో పోరాడాల్సి రావడం బాధాకరం. రాష్ట్ర ప్రజల కోసం సైకోతో పోరాడతా’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

గొర్రెల కాపరులు చనిపోతే రూ.10లక్షల బీమా..

సంస్కృతిని గుర్తు పెట్టుకొని భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. కురబ వర్గంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఐటీ రంగంలో కురబ వర్గానికి చెందిన వారు చాలా మంది స్థిరపడ్డారు. కురబలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. గొర్రెల కాపరులు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు బీమా ఇస్తాం. ఎప్పుడూ మన మూలాలను మరచిపోకూడదు. వైకాపా నాయకులు ఆలయ భూములను కూడా కబ్జా చేస్తున్నారు’’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని