Medak-BRS: అక్రమాల ఆరోపణలు.. అమ్మవారి వద్ద ప్రమాణాలు

మెదక్‌ జిల్లా ఏడుపాయల వనదుర్గాభవాని మాతకు చెందిన బంగారు, వెండి ఆభరణాలను ఆలయ ఈవో శ్రీనివాస్‌ తన ఇంట్లో భద్రపర్చడం వివాదాస్పదమైంది.

Updated : 08 Sep 2023 07:33 IST

మెదక్‌ అధికార పక్షంలో అసమ్మతి స్వరాలు

మెదక్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా ఏడుపాయల వనదుర్గాభవాని మాతకు చెందిన బంగారు, వెండి ఆభరణాలను ఆలయ ఈవో శ్రీనివాస్‌ తన ఇంట్లో భద్రపర్చడం వివాదాస్పదమైంది. ఈ విషయమై ఇటీవల ఆయన మాట్లాడుతూ.. మింట్‌ నుంచి బంగారం తీసుకొచ్చిన విషయాన్ని దేవేందర్‌రెడ్డి (ఎమ్మెల్యే పద్మ భర్త, ఇఫ్కో డైరెక్టర్‌)కి చెప్పానన్నారు. దీంతో ఈ వ్యవహారంలో దేవేందర్‌రెడ్డికి ప్రమేయం ఉందని, ఆయన భూకబ్జాలు వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని భారాస అసమ్మతి నాయకులు ఆరోపించారు. దేవేందర్‌రెడ్డి వాటిని ఖండించారు. అమ్మవారి సమక్షంలోనే నిరూపిస్తామని అసమ్మతి నాయకులు జీవన్‌రావు, గంగ నరేందర్‌, రాజిరెడ్డి తెలిపారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని దేవేందర్‌రెడ్డి పేర్కొంటూ తానూ ఆలయానికి వస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన 1,500 మంది అనుచరులతో ఊరేగింపుగా ఏడుపాయల ఆలయానికి చేరుకోగా, అసమ్మతి నాయకులు 500 మందితో ర్యాలీగా చేరుకున్నారు. మంజీరా నదిలో దేవేందర్‌రెడ్డి స్నానం చేసి తడి దుస్తులతో రాజగోపురంలో అమ్మవారి ఎదుట అక్రమాలకు పాల్పడలేదని ప్రమాణం చేశారు. అనంతరం అసమ్మతి నాయకులు స్నానం చేసి పసుపు దుస్తులతో దేవేందర్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని కొన్ని పత్రాలు అమ్మవారి వద్ద ఉంచి ప్రమాణం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని