Virat kohli: కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నా: డివిలియర్స్‌

కోహ్లీ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ తప్పుడు సమాచారం ఇచ్చిన తనను కోహ్లీ కుటుంబం క్షమించాలని మాజీ క్రికెటర్‌ డివిలియర్స్‌ అన్నాడు. 

Published : 10 Feb 2024 23:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోహ్లీ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ తప్పుడు సమాచారం ఇచ్చిన తనను కోహ్లీ కుటుంబం క్షమించాలని మాజీ క్రికెటర్‌ డివిలియర్స్‌ అన్నాడు. ‘‘నా స్నేహితుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం అందుబాటులో లేడు. అతడికి ప్రైవసీ ఇవ్వాలని అందర్నీ వేడుకుంటున్నా. కుటుంబమే తొలి ప్రాధాన్యం. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ, వారి ఏకాంతాన్ని గౌరవించాలి. నేను చేసిన తప్పుడు ప్రచారానికి క్షమించాలని కోహ్లీ కుటుంబాన్ని కోరుకుంటున్నా. తను మళ్లీ వచ్చి ఎప్పటిలాగే క్రికెట్‌ ఆడాలని ఎదురుచూస్తున్నా’’ అని తన యూట్యూబ్‌ ఛానల్లో ఏబీడీ తెలిపాడు.  

గతంలో కోహ్లీ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ డివిలియర్స్‌ (AB de Villiers) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తరువాత యూటర్న్‌ తీసుకున్న ఏబీడీ గత వీడియోలో పెద్ద తప్పు చేశా. తప్పుడు సమాచారాన్ని పంచుకున్నా. అందులో ఎలాంటి నిజం లేదు అని అన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ మొత్తానికి దూరంగా ఉన్న విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ (BCCI) మద్దతు తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని