Brian Lara: బుమ్రాకు బ్రియాన్‌ లారా ప్రత్యేక అభినందనలు

టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రాను వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియాన్‌ లారా ప్రత్యేకంగా అభినందించాడు...

Published : 03 Jul 2022 18:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రాను వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ బ్రియాన్‌ లారా ప్రత్యేకంగా అభినందించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శనివారం స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 84వ ఓవర్‌లో బుమ్రా (4, 5 వైడ్స్‌, 6 నోబాల్‌, 4, 4, 4, 6, 1) దంచికొట్టాడు. దీంతో ఒకే ఓవర్‌లో మొత్తం 35 పరుగులు రాబట్టాడు. అయితే, లారా (2003), బెయిలీ (2013), కేశవ్‌ మహారాజ్‌ (2020) ఒకే ఓవర్‌లో 28 పరుగుల చొప్పున బాదారు. ఇప్పుడు బుమ్రా ఈ ముగ్గుర్నీ అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే విండీస్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ ప్రత్యేకంగా ట్వీట్‌ చేసి మెచ్చుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని