Washington sundar: కొత్తగా తిరిగొచ్చా.. నన్ను నేను అర్థం చేసుకున్నా: వాషింగ్టన్‌ సుందర్‌

ఇంగ్లాండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

Published : 19 Nov 2022 02:11 IST

దిల్లీ: ఇంగ్లాండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఈ ఆల్‌రౌండర్‌ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో  జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాల్గొంటున్నాడు. గతంలో లంకాషైర్‌ తరఫున ఆడిన అనుభవం, ఎన్సీఏలో గడిపిన సమయం వంటివన్నీ తనను తాను మరింత ఉత్సాహంగా మలచుకోవడం కోసం ఉపయోగించుకున్నానని తెలిపాడు. 

‘‘గాయం నుంచి కోలుకునేందుకు ఎన్సీఏలో నేను చాలా కాలం పాటు ఉన్నాను. నా శరీరం మీదనే కాకుండా ఆటపై పట్టు సాధించేందుకు ఎంతో సాధన చేశాను. లంకాషైర్‌ తరఫున ఆడటం గొప్ప అనుభూతినిచ్చింది. నా ఆటతీరుతో పాటు నన్ను నేను అర్థం చేసుకునేందుకు ఆ అనుభవం నాకు ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడీ రెండు నెలల విరామం కూడా నాకెంతో పనికొచ్చింది. ప్రస్తుతం జరగనున్న సిరీస్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను’’ అని తెలిపాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు కావడంతో క్రికెటర్లు సరదాగా పుట్‌వాలీ ఆడుతూ కనిపించారు. అయితే సుందర్‌ ఇందుకు దూరంగా ఉన్నాడు. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవమే ఇందుకు కారణమని తెలిపాడు. ‘‘ఆరేళ్ల క్రితం ఇలాంటి ఓ సందర్భంలోనే ఫుట్‌బాల్‌ ఆడి కీలక మ్యాచ్‌కు ముందు చీలమండలం గాయంతో బాధపడ్డాను. ఇక అప్పటి నుంచి దాని జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. దానికి బదులుగా రన్నింగ్‌, తేలికపాటి వ్యాయామం చేయడానికే ఇష్టపడతాను’’ అంటూ సుందర్‌ వివరించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని