Asia cup: ఆసియాకప్‌ వేదికపై తుది నిర్ణయం అప్పుడే

ఐపీఎల్‌ ఫైనల్‌ తర్వాతే ఆసియా కప్‌ వేదికపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ప్రతినిధులు ఐపీఎల్‌ ఫైనల్‌కు హాజరవుతారని గురువారం అతడు తెలిపాడు.

Updated : 26 May 2023 07:15 IST

దిల్లీ: ఐపీఎల్‌ ఫైనల్‌ తర్వాతే ఆసియా కప్‌ వేదికపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ప్రతినిధులు ఐపీఎల్‌ ఫైనల్‌కు హాజరవుతారని గురువారం అతడు తెలిపాడు. ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా భారత జట్టును ఆ దేశానికి పంపకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌ల్ని తటస్థ వేదికపై నిర్వహిస్తామంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ నజమ్‌ సేథీ ప్రతిపాదన కూడా చేశాడు. ‘‘ఆసియా కప్‌ ఆతిథ్యానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేం ఐపీఎల్‌తో తీరిక లేకుండా ఉన్నాం. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుల నుంచి అత్యున్నత స్థాయి ప్రముఖులు ఐపీఎల్‌ ఫైనల్‌ చూసేందుకు వస్తున్నారు. మేం చర్చించుకుని తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని జై షా పేర్కొన్నాడు. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 17 వరకు ఆసియాకప్‌ జరగాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు