Ravi Shastri: బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్‌ఇండియా సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించలేకపోయిందని, అందుకే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుందని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్‌ఇండియా సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించలేకపోయిందని, అందుకే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుందని భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. జట్టు రక్షణాత్మక ధోరణి పట్ల అతను నిరాశ వ్యక్తం చేశాడు. ‘‘టాస్ గెలిచినా భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అలాగే బౌలింగ్‌లో నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌తో బరిలో దిగింది. ఒకవేళ సానుకూల దృక్పథం ఉండి ఉంటే కచ్చితంగా మొదట బ్యాటింగ్ చేయాల్సింది. తొలి సెషన్‌లో జాగ్రత్తగా ఆడి, ఆపై మొదటి రోజు 250 పరుగులు చేసినా బాగుండేది. ఇప్పుడు ఆస్ట్రేలియాదే పైచేయి. భారత్ తిరిగి పోటీలోకి రావాలన్నా.. అది ప్రత్యర్థి మీదే ఆధారపడి ఉంది. వాళ్లు గొప్పగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా తొలి రోజు అద్భుతంగా ఆడి పట్టు సాధించారు’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తొలి రోజు ఆటలో ఓ దశలో ఆసీస్‌ను 76/3తో భారత్ కట్టడి చేసినట్లే కనిపించింది. కానీ ఆ తర్వాత స్మిత్, హెడ్‌ను ఆపలేక చేతులెత్తేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా