IND vs PAK: వామ్మో ఇదేం రేటు.. భారత్ X పాక్‌ మ్యాచ్‌ టికెట్‌ ధర కోట్లలోనే!

భారత్ - పాకిస్థాన్‌ (IND vs ENG) మ్యాచ్‌ను చూడాలంటే పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. అయితే, అధికారికంగా టికెట్లను విక్రయించే సైట్లలో దొరికితే ఫర్వాలేదు. కానీ, రీసేల్‌ చేసే వెబ్‌సైట్లలో మాత్రం లక్షలు, కోట్లను పెట్టక తప్పదు. 

Published : 04 Mar 2024 13:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - పాకిస్థాన్‌ (IND vs ENG) మ్యాచ్‌ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఎదురు చూస్తుంటుంది. టీ20 ప్రపంచకప్‌ 2024లో (T20 World Cup 2024) జూన్ 9న న్యూయార్క్‌ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య జరగనున్న పోరాటం చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉంటారు. అయితే, టికెట్ల రేట్లు మాత్రం వారికి అందుబాటులో ఉండటం కష్టంగానే ఉంది. వందల్లో ఉండాల్సిన ధరలు కోట్లను దాటేయడం గమనార్హం. డైరెక్ట్‌ సేల్‌ వెబ్‌సైట్లలో తక్కువ ధర ఉన్న టికెట్‌ రేట్లు.. రీసేల్‌కు వచ్చేసరికి మాత్రం చుక్కలు చూపిస్తాయి. 

అధికారికంగా టికెట్‌ కనీస ధర 6 డాలర్ల (రూ. 500) నుంచి ప్రారంభమవుతుంది. ప్రీమియం సీట్‌ రేటు 400 డాలర్లు (దాదాపు రూ. 34,000) వరకు ఉంటుంది. ఫిబ్రవరి మూడో వారం నుంచి టికెట్లను అందుబాటులో ఉంచగా.. హాట్‌ కేకుల్లో అమ్ముడయ్యాయి. అయితే, రీసేల్‌ చేసే కొన్ని వెబ్‌సైట్లలో టికెట్ల ధరలు దాదాపు 100 రెట్లు పెరగడం గమనార్హం. 400 డాలర్ల విలువైన టికెట్‌ సదరు రీసేల్‌ వెబ్‌సైట్లలో 40వేల డాలర్లకు చేరింది. ఇక ప్లాట్‌ఫామ్‌ ఫీజు, ఇతర రుసుములతో కలిపి అది 50 వేల డాలర్లకుపైమాటే. అంటే మన రూపాయల్లో దాదాపు రూ. 42 లక్షలు. సెకండరీ మార్కెట్‌లో ఎన్‌బీఏ ఫైనల్స్‌ను చూసేందుకు సీట్‌ అత్యధిక ధర 24వేల డాలర్ల కాగా.. ఇప్పుడు భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌కు రెట్టింపు సొమ్మను వెచ్చించాల్సి ఉంది. మరొక ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియం సీట్‌ ధర ఏకంగా రూ. 1.40 కోట్ల నుంచి రూ. 1.85 కోట్లకు వెళ్లిపోయింది. దాదాపు 1,75,000 డాలర్లు వెచ్చిస్తే కానీ దాయాదుల పోరుకు ప్రీమియం బెర్తు దక్కదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని