Asian Games: ఆర్చరీలో మరో స్వర్ణం.. జ్యోతి బృందం అద్భుతం

ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌కు నేడు మరో స్వర్ణం వచ్చింది. ఆర్చరీ మహిళా విభాగంలో జ్యోతి బృందం విజయం సాధించింది. 

Updated : 05 Oct 2023 11:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌ మరో స్వర్ణం సాధించింది. మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌ విభాగంలో భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం గోల్డ్‌ నెగ్గింది. చైనీస్‌ తైపీపై భారత్ బృందం విజయం సాధించింది. టీమ్‌ఇండియా బృందం 230-229 తేడాతో గెలిచింది. దీంతో మన ఖాతాలో 19వ పసిడి పతకం చేరింది. మొత్తం పతకాల సంఖ్య 82కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. 

పీవీ సింధు ఓటమి 

భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు చైనా క్రీడాకారిణి చేతిలో ఓటమిపాలైంది. సింధుపై బింగ్‌జియావో 21-16, 21-12 తేడాతో విజయం సాధించింది. ఇక సాఫ్ట్‌ టెన్నిస్‌లోనూ భారత్‌ ప్రతికూల ఫలితమే ఎదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫిలిప్పైన్స్‌ జోడీపై భారత్‌ ద్వయం ఆద్య తివారీ - జయ్‌ మీనా ఓటమిపాలైంది. భారత బాక్సర్‌ అంతిమ్‌ పంగల్‌ 53 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో కాంస్య పతకం కోసం మంగోలియా బాక్సర్‌తో తలపడనుంది. మరోవైపు స్టార్‌ షట్లర్ ప్రణయ్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో మలేషియా ఆటగాడు జి జియాపై చివరి వరకూ పోరాడి 21-16, 21-23, 22-20 తేడాతో విజయం సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని