Virat Kohli: కోహ్లీకి సొంత రికార్డుల కంటే.. జట్టు విజయమే ముఖ్యం: మహమ్మద్‌ రిజ్వాన్‌

విరాట్‌ కోహ్లీకి తన రికార్డుల కంటే భారత్‌ను గెలిపించడమే ముఖ్యమని పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ ప్రశంసించాడు. 

Published : 10 Feb 2024 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరాట్‌ కోహ్లీ (Virat Kohli) తన వ్యక్తిగత రికార్డుల కంటే జట్టును గెలిపించడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాడని పాకిస్థాన్‌ వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ (Mohammed Rizwan) ప్రశంసించాడు. భారత్‌ను గెలిపించడమే కోహ్లీ (Virat Kohli) ముఖ్య లక్ష్యం అని అన్నాడు. 35 ఏళ్ల విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 26,700 పరుగులు చేశాడని, భారత్‌ విజయం సాధించిన మ్యాచుల్లో 65 శాతం పరుగులు అతడివే ఉంటాయని కొనియాడాడు. 

‘‘మనం ప్రాతినిథ్యం వహించే జట్టుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ కొందరు తమ సొంత రికార్డుల కోసం ఆడతారు. మన గణాంకాలు ప్రజలు చూడటానికి మాత్రమే పనికొస్తాయి. తమ గురించి ఆడేవాళ్లు మామూలు ఆటగాళ్లు అవుతారు. కానీ విరాట్‌ కోహ్లీ అలా కాదు. అత్యధిక సగటు కలిగిఉన్నా అతడు వ్యక్తిగత రికార్డులను పట్టించుకోడు. జట్టుకు ఏం అవసరమో తెలుసుకొని పరిస్థితికి తగ్గట్టు ఆడతాడు. నేను కూడా అలాగే చేస్తా’’ అని రిజ్వాన్‌ అన్నాడు. 

2015లో అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించిన రిజ్వాన్‌ పాకిస్థాన్‌ విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాడు. టీ20ల్లో 48 సగటుతో దాదాపు 3వేల పరుగులు, వన్డేల్లో 40 సగటుతో 2 వేల పరుగులు, టెస్టుల్లో 40 సగటుతో 1600 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6 శతకాలు నమోదు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని