భారత జట్టుని చూసి గర్వ పడుతున్నా: రాహుల్‌ ద్రవిడ్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు ముఖ్యమైన ఆటగాళ్లు దూరమైనా ప్రతిభ గల యువకులు జట్టులో చేరి అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారని రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) అన్నారు. 

Published : 09 Mar 2024 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 4-1 తేడాతో భారత్‌ గెలిచింది. అనంతరం ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ మాట్లాడుతూ జట్టును చూస్తే గర్వంగా ఉందన్నారు. తొలి టెస్టులో ఓటమి పాలైనా తర్వాత మ్యాచుల్లో గొప్పగా పుంజుకున్నామని తెలిపారు. ఈ సిరీస్‌కు ముఖ్యమైన ఆటగాళ్లు దూరమైనా ప్రతిభ గల ప్లేయర్లు భారత్‌లో ఎంతోమంది ఉన్నారని, యువకులు జట్టులో చేరి అవకాశాలు సద్వినియోగం చేసుకున్నారని ఆనందం వ్యక్తంచేశారు. 

‘‘నేను కూడా నిత్యం జట్టు సభ్యుల నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను. రోహిత్‌ శర్మ (Rohit Sharma)తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. అతనొక గొప్ప నాయకుడు. యువ ఆటగాళ్లకు ప్రేరణగా నిలుస్తాడు. కోచ్‌గా ఉన్నా, కెప్టెన్‌గా ఉన్నా ఎక్కువమంది యువకులకు అవకాశం ఇవ్వలేం. ఈవిషయంలో సెలక్షన్‌ కమిటీ, అజిత్‌ అగార్కర్‌ (Agarkar)కు ధన్యవాదాలు. ఆటగాళ్ల ఎంపిక అనేది అంత సులభం కాదు. ప్రతిభ గల యువకులను కమిటీ ఎంపిక చేసింది. వచ్చిన అవకాశాన్ని వారు కూడా సరిగ్గా వినియోగించుకున్నారు. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌ మధ్యలో ఇంటికి వెళ్లిన అశ్విన్‌ (Ashwin) రెండో రోజునే తిరిగొచ్చి మ్యాచ్‌లో పాల్గొనడం అభినందనీయం’’ అని ద్రవిడ్‌ అన్నారు.  టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి టెస్టులో ఓటమిపాలైన తర్వాత వరుసగా నాలుగు టెస్టులు గెలిచి సిరీస్‌ సాధించిన మొదటి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని