Jadeja on playing against Pakistan: మనం ఎలా ఆలోచిస్తామో.. పాక్‌ ఆటగాళ్లూ అలానే..: జడ్డూ

ప్రపంచ క్రికెట్‌లో హైఓల్టేజీ మ్యాచ్‌ అంటే భారత్ - పాక్‌ (IND vs PAK) పోరే. తమ జట్టే గెలవాలని అభిమానులు కోరుకోవడం సహజం. మరి ఇలాంటి మ్యాచ్‌పై ఆటగాళ్లు ఏమనుకుంటారనేది కీలకం. ఇదే విషయంపై రవీంద్ర జడేజా స్పందించాడు.

Updated : 13 Aug 2023 12:07 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - పాకిస్థాన్‌ జట్ల (IND vs PAK) మధ్య ఆసియా కప్‌ వేదికగా సెప్టెంబర్ 2న మ్యాచ్‌ జరగనుంది. గత ఆసియా కప్‌ సూపర్‌ -4లో జరిగిన పరాభవానికి ఈసారి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. పాక్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తాజాగా దాయాదుల పోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల ఆటగాళ్లు విజయం కోసం కష్టపడతారని.. అందులో ఎవరు గెలుస్తారనేది ఆ రోజు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినదానిపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించాడు. 

వారి మద్దతు అద్భుతం.. అదే అక్కరకొచ్చింది.. మేం 15 రన్స్‌ తక్కువ చేశాం!

‘‘భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్‌ అంటే ప్రతి ఒక్కరిలోనూ భారీగా అంచనాలు ఉంటాయి. తమ జట్టే గెలవాలని కోరుకుంటారు. క్రికెటర్లుగా మాకు ప్రతి మ్యాచ్‌ కీలకమే. పాక్‌తో మ్యాచ్‌నూ ఇలాగే భావిస్తాం. అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికే ప్రయత్నిస్తాం. ఫలితం మాత్రం కేవలం మా చేతుల్లోనే లేదు. ప్రతి ఒక్కరి దృష్టి మ్యాచ్‌పైనే ఉంటుంది. అయితే.. ఒక్కోసారి ఫలితం మనకు అనుకూలంగా వస్తుంది. పాకిస్థాన్‌ ఆటగాళ్లూ వారి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు. వారు కూడా గెలవాలనే ఆడతారు. దీనికి కూడా గ్యారంటీ లేదు. మైదానంలో బరిలోకి దిగితే వందశాతం కష్టపడుతున్నామా..? లేదా..? అనేది ముఖ్యం. ఫలితం అనుకున్న విధంగా వచ్చినా రాకపోయినా శ్రమించడం మాత్రం విరమించేదీ ఉండదు’’ అని జడేజా తెలిపాడు.

ప్రస్తుతం రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటూనే ఆసియా కప్‌ కోసం సిద్ధవుతున్నాడు. త్వరలోనే ఆసియా కప్‌ కోసం జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. ఇదే జట్టు దాదాపు వన్డే ప్రపంచకప్‌లోనూ ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజాకు స్థానం ఖాయం. మరోవైపు కేఎల్ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్ పరిస్థితిపై బీసీసీఐ ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని