Sanjay manjrekar: ట్విటర్‌ వల్ల నష్టమే ఎక్కువ!

సామాజిక మాధ్యమాలను తాను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోతున్నానని టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అంటున్నాడు. ట్విటర్‌ వల్ల తనకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.......

Published : 20 Jun 2021 01:32 IST

అర్థమవ్వడం లేదని సంజయ్‌ మంజ్రేకర్‌ ఆవేదన

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాలను తాను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోతున్నానని టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ అంటున్నాడు. ట్విటర్‌ వల్ల తనకు లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అందరూ ఇష్టపడేలా ట్వీట్లు ఎలా చేయాలో ఇప్పటికీ అర్థమవ్వడం లేదని వాపోయాడు.

క్రికెట్‌ వ్యాఖ్యానం చేయడంలో సంజయ్‌ మంజ్రేకర్‌ మేటి! ఆట పరంగా విశ్లేషణ బాగుంటుంది. కొన్నిసార్లు ఆటగాళ్లపై చేసే వ్యాఖ్యలు మాత్రం  వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో రవీంద్ర జడేజాపై చేసిన బిట్స్‌ అండ్‌ పీసెస్‌ అతడికి చేటు చేసింది. ఆ తర్వాత హర్షభోగ్లేను అవమానిస్తూ మాట్లాడాడు. అతడిపై విమర్శలు వెల్లువెత్తడంతో  కొన్నాళ్లు వ్యాఖ్యానం చేయకుండా బీసీసీఐ నిషేధించింది. కొన్ని రోజుల క్రితం తన ఆల్‌టైం గ్రేట్‌ పుస్తకంలో అశ్విన్‌ ఇంకా చోటు దక్కించుకోలేదని ట్వీట్‌ చేశాడు. దానిపైనా దుమారం రేగింది. ఈ నేపథ్యంలో అతడు సోషల్‌ మీడియా గురించి మాట్లాడాడు.

‘ట్విటర్‌ రెండువైపులా పదునైన కత్తి. కొన్ని సందర్భాల్లో మంచి చేస్తే ఎక్కువ సార్లు చెడే చేసింది. సమతూకం కోసం ప్రయత్నించినా నష్టాన్నే ఎక్కువ కలిగించింది. సోషల్‌ మీడియా ఒక మృగంలా అనిపిస్తోంది. దానిని అర్థం చేసుకోలేకపోతున్నా. నేనెన్నో టెక్నిక్‌లు ప్రయత్నించాను. ఇప్పటికీ సోషల్‌ మీడియాలో పోస్టులు ఎలా పెట్టాలో అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నా’ అని సంజయ్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని