Danushka Gunathilaka: లైంగిక ఆరోపణల కేసు.. ఆస్ట్రేలియాలో క్రికెటర్‌ అరెస్ట్‌

లైంగిక వేధింపుల కేసులో శ్రీలంక క్రికెటర్‌ దనుష్క గుణతిలకను ఆదివారం సిడ్నీ పోలీసులు అరెస్టు చేసినట్టుగా  సమాచారం అందుతోంది.

Updated : 06 Nov 2022 18:07 IST

దిల్లీ: లైంగిక వేధింపుల కేసులో శ్రీలంక క్రికెటర్‌ దనుష్క గుణతిలకను ఆదివారం సిడ్నీ పోలీసులు అరెస్టు చేసినట్టుగా  సమాచారం అందుతోంది. టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఈ ఆటగాడిని ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఆటగాడు లేకుండానే  శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా నుంచి వెనుదిరిగింది. 

‘‘నిందితుడికి కొంతకాలం క్రితం ఆన్‌లైన్‌లో 29 ఏళ్ల మహిళ పరిచయమైంది. వీరిద్దరూ నవంబర్‌ 2న రోజ్‌ బే లోని ఓ హెటల్‌ గదిలో కలుసుకున్నారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. కేసు దర్యాప్తులో భాగంగా ఓ శ్రీలంక దేశస్థుడిని నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు’’ అని పోలీసులు వారి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించారు. అయితే ఈ అంశంపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధికారికంగా స్పందించాల్సి ఉంది. నమీబియాతో మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో పాల్గొన్న ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాటర్‌.. అనంతరం గాయం కారణంగా ఈ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని