IND vs SA: స్కై బ్యాటింగ్‌ దూకుడు.. కుల్‌దీప్‌ వికెట్ల వేట.. మూడో టీ20 వీడియోస్‌ స్పెషల్‌!

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA) మూడో టీ20 మ్యాచ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల సమాహారం.. 

Updated : 16 Dec 2023 15:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సిరీస్‌లోని చివరి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 106 పరుగుల తేడాతో చిత్తు చేయడంలో భారత (IND vs SA) బౌలర్లు కీలక పాత్ర పోషించారు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ టీమ్‌ఇండియా దూకుడుగా ఆడింది. మూడో టీ20లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించి సఫారీ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి స్పెషల్‌ వీడియోలు మీ కోసం.. 

క్లాస్‌ బ్యాటింగ్‌లోనూ దూకుడు...

భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (60) ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయినా.. ఏకాగ్రత కోల్పోకుండా అర్థ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (100)తో కలిసి మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించాడు. 


మార్‌క్రమ్‌ దొరికిపోయాడిలా..

దక్షిణాఫ్రికా కెప్టెన్‌ మార్‌క్రమ్‌ బ్యాటింగ్‌ (14 బంతుల్లో 25) దూకుడుకు రవీంద్ర జడేజా అడ్డుకట్ట వేశాడు. జడ్డూ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ఆడేందుకు యత్నించి యశస్వి జైస్వాల్‌ చేతికి దొరికిపోయాడు. 


కుల్‌దీప్‌ పాంచ్‌ పటాకా

దక్షిణాఫ్రికా కుప్పకూలడంలో కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు. కేవలం 2.5 ఓవర్లలోనే 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. వీటిల్లో కూడా కేవలం 6 బంతుల వ్యవధిలో (12,14 ఓవర్లలో) నాలుగు వికెట్లను కూల్చడం విశేషం. ఇక బర్త్‌డే రోజున ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు.


సూర్య మార్క్‌ సిక్స్‌

లెగ్‌ సైడ్‌ పడిన బంతిని ఫ్లిక్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ దానిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ షాట్‌ మ్యాచ్‌కే హైలైట్‌. 


దక్షిణాఫ్రికా వికెట్లు పడిందిలా..

భారత్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 95 పరుగులకే కుప్పకూలింది. తొలి వికెట్‌ను ముకేశ్‌ కుమార్‌ తీయగా.. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను కుల్‌దీప్‌ ముగించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని