Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. హసరంగ స్థానంలో మరో శ్రీలంక లెగ్ స్పిన్నర్‌

ఐపీఎల్‌ 17 సీజన్‌ మొత్తానికి దూరమైన వానిందు హసరంగ (Wanindu Hasaranga) స్థానంలో శ్రీలంకకే చెందిన మరో లెగ్ స్పిన్నర్‌ విజయ్‌కాంత్ వియస్కాంత్‌ (Vijaykanth Viyaskanth)ను సన్‌రైజర్స్‌ తీసుకుంది.

Published : 09 Apr 2024 19:10 IST

ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)లోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా ఐపీఎల్‌ 17 సీజన్‌ మొత్తానికి దూరమైన వానిందు హసరంగ (Wanindu Hasaranga) స్థానంలో శ్రీలంకకే చెందిన మరో లెగ్ స్పిన్నర్‌ విజయ్‌కాంత్ వియస్కాంత్‌ (Vijaykanth Viyaskanth)ను సన్‌రైజర్స్‌ తీసుకుంది. ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం విజయ్‌కాంత్‌ను అతడి బేస్ ధర రూ.50 లక్షలకు హైదరాబాద్‌ జట్టులో చేర్చుకుంది. ఈవిషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. 22 ఏళ్ల విజయ్‌కాంత్ ఇప్పటివరకు ఫ్రాంచైజీ క్రికెట్‌లో 33 టీ20లు ఆడి 42 వికెట్లు పడగొట్టాడు. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఎడమ మడమ నొప్పి కారణంగా వానిందు హసరంగ ఈ ఐపీఎల్‌ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. అతడిని గత ఏడాది మినీ వేలంలో సన్‌రైజర్స్‌ రూ.1.5 కోట్లకు దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని