Virat kohli: కోహ్లీని కుమారుడిగా చూస్తా.. నేనెందుకు చెడుగా మాట్లాడుతా: మాజీ సెలక్టర్‌

విరాట్‌ కోహ్లీ (virat kohli)ని తన సొంత కుమారుడిలా భావిస్తానని భారత మాజీ సెలక్టర్‌ చేతన్‌(chetan sharma)శర్మ అన్నాడు. అతడు తిరిగి జట్టులోకి రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు.

Published : 01 Feb 2024 19:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)ని తన సొంత కుమారుడిలా భావిస్తానని భారత మాజీ సెలక్టర్‌ చేతన్‌ శర్మ (Chetan Sharma) అన్నాడు. అతడు తిరిగి జట్టులోకి రావాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. గతేడాది ఓ స్టింగ్‌ ఆపరేషన్‌లో విరాట్‌ కోహ్లీ, సౌరవ్‌ గంగూలీ, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యాతో పాటు జట్టులోని ఇతర ఆటగాళ్లపై చేతన్‌ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దానిపై దుమారం రేగడంతో సెలక్టర్‌ పదవికి రాజీనామా చేశాడు.

‘‘విరాట్‌ గురించి నేనెందుకు చెడుగా మాట్లాడతా? జట్టులోకి తిరిగి వచ్చి అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు పూర్తి చేయాలని ఆశిస్తున్నా’’ అని చేతన్‌ అన్నాడు. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను సైతం ఆయన ప్రశంసించాడు. ‘‘జట్టు కోసం తనను తాను త్యాగం చేసే కొద్దిమంది ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ కూడా ఉంటాడు. ఓపెనర్లు 10 ఓవర్లలో 80 పరుగులు చేస్తే మిగిలిన బ్యాటర్లు 300 వరకు జట్టు స్కోరును తీసుకెళ్లగలరు’’ అంటూ 2023 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్‌ శర్మ ఆడిన ఎటాకింగ్‌ క్రికెట్‌ను మెచ్చుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని