WTC Final- Gill: వివాదాస్పద క్యాచ్‌పై శుభ్‌మన్ గిల్ సెటైరికల్ ట్వీట్.. క్షణాల్లో వైరల్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (18) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. బొలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్ మొదటి బంతిని స్లిప్‌లో కామెరూన్ గ్రీన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఈ క్యాచ్ వివాదస్పదంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్‌ఇండియా పోరాడుతోంది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44*), అజింక్య రహానె (20*) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 280 పరుగులు అవసరం. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (18) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. బొలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్ మొదటి బంతిని స్లిప్‌లో కామెరూన్ గ్రీన్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఈ క్యాచ్ వివాదస్పదంగా మారింది. బంతి నేలకు తాకిన తర్వాత గ్రీన్ అందుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. కానీ, థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో గిల్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు.
శుభ్‌మన్ గిల్ నాటౌట్ అని స్పష్టంగా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించడంపై టీమ్‌ఇండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్ కూడా దీనిపై సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. థర్డ్ అంపైర్‌కు కళ్లు సరిగ్గా కనిపించలేదా? అనే అర్థం వచ్చేలా గ్రీన్ క్యాచ్ అందుకుంటున్నప్పుడు బంతి నేలకి తాకిన ఫొటోను ట్వీట్ చేస్తూ ‘‘🔎🔎🤦🏻’’ అని ఎమోజీలు జోడించాడు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్