గూగుల్ వర్క్‌ప్లేస్‌ కొత్త లుక్‌..ఎందుకంటే?

ఎంతో కాలంగా మనకు దర్శనమిస్తున్న గూగుల్ జీ సూట్ అప్లికేషన్లు కొత్త లుక్‌లో కనిపించనున్నాయి. దాంతో పాటు జీ సూట్ పేరును కూడా గూగుల్ వర్క్‌స్పేస్‌గా మార్చారు. అలానే జీ సూట్‌లోని అప్లికేషన్స్‌లో కొత్త ఫీచర్స్‌ యాడ్‌ చేయడమే....

Updated : 07 Dec 2022 22:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎంతో కాలంగా మనకు దర్శనమిస్తున్న గూగుల్ జీ సూట్ అప్లికేషన్లు కొత్త లుక్‌లో కనిపించనున్నాయి. దాంతో పాటు జీ సూట్ పేరును కూడా గూగుల్ వర్క్‌స్పేస్‌గా మార్చారు. అలానే జీ సూట్‌లోని అప్లికేషన్స్‌లో కొత్త ఫీచర్స్‌ యాడ్‌ చేయడమే కాకుండా డాక్స్‌, మీట్, షీట్స్‌, క్యాలెండర్‌ అప్లికేషన్లను గూగుల్‌ వర్కప్లేస్‌లో చేర్చుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా రెడ్, వైట్‌ కలర్స్‌ ఎన్వలప్‌ లోగోతో ఉండే జీ-మెయిల్ ఇక మీదట కొత్తగా కనిపించబోతోంది. పాత లోగో స్థానంలో బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్‌ రంగుల్లో ఎం అక్షరాన్ని పోలిన లోగోను తీసుకొస్తున్నారు. అయితే ఈ మార్పు అంత సులభంగా జరగలేదట. గూగుల్‌ బృందం ఇందుకోసం ఎన్నో రకాల డిజైన్లను పరిశీలించి, ఎంతో మంది యూజర్స్‌ అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారట.

జీ-మెయిల్‌తో పాటు గూగుల్‌ డ్రైవ్‌, మీట్, క్యాలెండర్‌, డాక్స్‌, షీట్స్‌, స్లైడ్స్‌ వంటి పలు ప్రొడక్ట్‌ల లోగోలకు గూగుల్ కొత్త రూపునిచ్చింది. క్యాలెండర్‌ యాప్‌లో బ్లూ రంగును హైలైట్ చేశారు. లోగో మధ్యలో 31 తేదీని ఉంచారు. డ్రైవ్‌లో గతంలో ఉన్న ఎల్లో, బ్లూ, గ్రీన్‌ రంగులతో పాటు కొత్తగా బ్లూ కలర్‌ని యాడ్ చేశారు. డాక్స్‌ని కూడా క్యాలెండర్‌ తరహాలోనే చతురస్రాకారంలో డిజైన్‌ చేశారు. ఛాట్స్‌కి గ్రీన్‌ కలర్‌ లోగో, జీమీట్‌కి నాలుగు కలర్స్‌తో వీడియో సింబల్ యాడ్ చేశారు. గూగుల్ కీప్‌ లోగోలో కొత్తగా బల్బ్‌, వాయిస్‌లో ఫోన్ సింబల్స్‌ చేర్చారు. జీ సూట్‌ పేరు ఇది తొలిసారి కాదు. గతంలో గూగుల్‌ యాప్స్‌ను జీ సూట్‌గా మార్చారు. తాజాగా గూగుల్ వర్క్‌స్పేస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌ అవసరాలకు దృష్టిలో ఉంచుకుని, ఫ్రెండ్లీ యూజర్ ఫీచర్సతో వర్క్‌స్పేస్‌లో మార్పులు చేసినట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని