వేలిముద్రనుఫోన్‌ ఎలా గుర్తిస్తుంది?

కొన్ని ఫోన్లు వేలిముద్రతో అన్‌లాక్‌ అవుతుంటాయి కదా. ఇవి వేలిముద్రను ఎలా గుర్తిస్తాయి? ఇందుకోసం ఫోన్లు 3 రకాల.. ఆప్టికల్‌, కెపాసిటివ్‌, అల్ట్రాసోనిక్‌ పరిజ్ఞానాలను వాడుకుంటాయి. వీటిల్లో అన్నింటికన్నా పాతది ఆప్టికల్‌ ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌. ఇది సూక్ష్మమైన కెమెరాతో చిన్న ఎల్‌ఈడీ లేదా ఫోన్‌ తెర సాయంతో వేలి ఫొటోను తీసుకుంటుంది

Updated : 12 Jan 2022 00:25 IST

కొన్ని ఫోన్లు వేలిముద్రతో అన్‌లాక్‌ అవుతుంటాయి కదా. ఇవి వేలిముద్రను ఎలా గుర్తిస్తాయి? ఇందుకోసం ఫోన్లు 3 రకాల.. ఆప్టికల్‌, కెపాసిటివ్‌, అల్ట్రాసోనిక్‌ పరిజ్ఞానాలను వాడుకుంటాయి. వీటిల్లో అన్నింటికన్నా పాతది ఆప్టికల్‌ ఫింగర్‌ప్రింట్‌ రీడర్‌. ఇది సూక్ష్మమైన కెమెరాతో చిన్న ఎల్‌ఈడీ లేదా ఫోన్‌ తెర సాయంతో వేలి ఫొటోను తీసుకుంటుంది. అయితే ఇది నాణ్యమైన వేలిముద్ర ఫొటోను సైతం నిజమైన వేలిముద్రగా భావించొచ్చు. ఇక్కడే కెపాసిటివ్‌ సెన్సర్‌ పరిజ్ఞానం సాయం చేస్తుంది. వేలు నిజమైందో కాదో గుర్తిస్తుంది. ఇది విద్యుత్తును నిల్వ చేసుకునే కెపాసిటర్ల సముదాయంతో కూడుకొని ఉంటుంది. తెరకు వేలిముద్రల ఎత్తు ఒంపులు తగిలినప్పుడే దీన్నుంచి విద్యుత్తు విడుదలవుతుంది. తర్వాత వేలి ముద్రల తీరుతెన్నులను పసిగడుతుంది. కొన్నిసార్లు ఈ సెన్సర్లు తెరను స్వైప్‌ చేయటానికీ ఉపయోగపడతాయి. ఇక అన్నింటికన్నా అధునాతమైనది అల్ట్రాసోనిక్‌ సెన్సర్‌ పరిజ్ఞానం. వైద్య పరీక్షలకు వాడుకునే అల్ట్రాసోనిక్‌ స్కానర్ల మాదిరిగానే పనిచేస్తుంది. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌కు వేలిని తాకించినప్పుడు అల్ట్రాసోనిక్‌ శబ్ద ప్రచోదకం విడుదల అవుతుంది. ఇది వేలిని తాకి వెనక్కి వచ్చే శబ్దం ఆధారంగా గీతల ఎత్తు ఒంపులను 3డీ రూపంలో విడమరచుకుంటుంది. నిజమైన వేలి ముద్రలను గుర్తిస్తుంది. గబ్బిలాలు, తిమింగలాలు, డాల్ఫిన్లు సైతం ఇలా అల్ట్రాసోనిక్‌ శబ్ద ప్రతిధ్వనులతోనే తమ పరిసరాల ఆకారాలు, దూరాలను అర్థం చేసుకుంటాయి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని