వ్యాపార సౌలభ్యానికి వాట్సప్‌ క్విక్‌ రిప్లై

వాట్సప్‌. రోజువారీ జీవితంతో ఎంతగా పెనవేసుకుపోయిందో. మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, ఫైళ్లు పంపించుకోవటమే కాదు.. ఆడియో, వీడియో కాల్స్‌ సైతం వాట్సప్‌తోనే. వ్యాపారాలూ కానిచ్చేస్తున్నాం. ఇలాంటి బిజినెస్‌ ఖాతాల కోసం వాట్సప్‌ కొత్తగా ‘క్విక్‌ రిప్లైస్‌’ ఫీచర్‌నూ ప్రవేశపెట్టింది.

Updated : 22 Dec 2021 05:07 IST

వాట్సప్‌. రోజువారీ జీవితంతో ఎంతగా పెనవేసుకుపోయిందో. మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, ఫైళ్లు పంపించుకోవటమే కాదు.. ఆడియో, వీడియో కాల్స్‌ సైతం వాట్సప్‌తోనే. వ్యాపారాలూ కానిచ్చేస్తున్నాం. ఇలాంటి బిజినెస్‌ ఖాతాల కోసం వాట్సప్‌ కొత్తగా ‘క్విక్‌ రిప్లైస్‌’ ఫీచర్‌నూ ప్రవేశపెట్టింది. వినియోగదారులతో సంభాషణలను మరింత తేలికగా, సత్వరం కొనసాగించటానికి దీన్ని తీసుకొచ్చింది. తరచూ పంపే సందేశాలను షార్ట్‌ కట్స్‌ ద్వారా తక్షణం పంపుకోవటానికిది వీలు కల్పిస్తుంది. ఆయా మెసేజ్‌ల కోసం షార్ట్‌ కట్స్‌ను సృష్టించుకోవచ్చు. అక్షరాలను మాత్రమే కాదు.. గ్రాఫిక్స్‌, వీడియోలను సైతం క్విక్‌ రిప్లైల కోసం ఎంచుకోవచ్చు.

సెట్‌ చేసుకునేదెలా?
* వాట్సప్‌ బిజినెస్‌ అకౌంట్‌ గలవారు మోర్‌ ఆప్షన్స్‌ ద్వారా బిజినెస్‌ టూల్స్‌లోకి వెళ్లాలి.
* క్విక్‌ రిప్లైస్‌ మీద నొక్కి యాడ్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి.
* మెసేజ్‌ ఆప్షన్‌ మీద నొక్కుతూ మీడియా మెసేజ్‌లకు మెసేజ్‌ లేదా క్విక్‌ రిప్లైలను సృష్టించుకోవచ్చు. అయితే వాట్సప్‌ వెబ్‌లో మీడియా ఫైళ్లను క్విక్‌ రిప్లైగా ఎంచుకోవటం సాధ్యం కాదు.
* తర్వాత షార్ట్‌కట్స్‌ మీద నొక్కి, క్విక్‌ రిప్లై కోసం షార్ట్‌కట్‌గా కీవర్డ్‌ను సెట్‌ చేసుకోవాలి. సేవ్‌ చేసుకోవాలి.

ఎలా పంపించాలి?
ఛాట్‌ను ఓపెన్‌ చేసి, మెసేజ్‌ టెక్స్ట్‌ బాక్స్‌ మీద ట్యాప్‌ చేయాలి. / లేదా టు సెండ్‌ మీడియా ఫైల్స్‌ అని టైప్‌ చేయాలి. అటాచ్‌ చేసిన సింబల్‌ మీద ట్యాప్‌ చేసి వెంటనే దాన్ని అవతలివారికి పంపించుకోవచ్చు. కీవర్డ్‌ను సెట్‌ చేసుకుంటే ‘/’ తర్వాత కీవర్డ్‌ను ఎంటర్‌ చేస్తే దానికి సంబంధించిన మెసేజ్‌లే కనిపిస్తాయి. వీటిని ఎంచుకొని ఇట్టే పంపించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని