గ్రూప్‌లో అందరికీ మెటా మెసేజ్‌ నోటిఫికేషన్‌

మెటా (ఫేస్‌బుక్‌) కొత్తగా @everyone ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ముందుగా దీన్ని టైప్‌ చేసి, ఆ తర్వాత మెసేజ్‌ను ఆరంభిస్తే ఛాట్‌లో పాల్గొనేవారందరికీ కొత్త మెసేజ్‌ సమాచారం అందుతుంది. ఇది గ్రూప్‌ రిమైండర్‌గా బాగా ఉపయోగపడుతుంది.

Updated : 06 Apr 2022 16:07 IST

మెటా (ఫేస్‌బుక్‌) కొత్తగా @everyone ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ముందుగా దీన్ని టైప్‌ చేసి, ఆ తర్వాత మెసేజ్‌ను ఆరంభిస్తే ఛాట్‌లో పాల్గొనేవారందరికీ కొత్త మెసేజ్‌ సమాచారం అందుతుంది. ఇది గ్రూప్‌ రిమైండర్‌గా బాగా ఉపయోగపడుతుంది. సంయుక్త సమావేశాలకు సమాయత్తమయ్యేవారికి, ఏదైనా విషయంపై మేధో మథనం చేసేవారికీ తక్షణం సమాచారం తెలుసుకోవటానికి వీలు కల్పిస్తుంది. అంతేకాదు.. అత్యవసరం కాని మెసేజ్‌ల కోసం మెటా /silent ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టటానికీ ప్రయత్నిస్తోంది. గ్రూప్‌ ఛాట్‌లో మెసేజ్‌ను పంపటానికి ముందు /silent టైప్‌ చేస్తే మిగతా సభ్యులకు దీనికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ అందదు. దీంతో అత్యవసరం కాని నోటిఫికేషన్ల బెడద తప్పుతుంది. వీలున్నప్పుడే తీరికగా మెసేజ్‌లను చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని