చెవిని తడితే ఇయర్‌ ఫోన్‌ ఆన్‌!

చెవి వద్ద వేలితో తడితే ఇయర్‌ ఫోన్‌ ఆన్‌! మరోసారి తాకితే ఆఫ్‌!! సౌండ్‌ పెంచుకోవాలంటే వేలిని పైకి జరిపితే చాలు. వేలిని కిందికి జరిపితే సౌండ్‌ తగ్గించుకోవచ్చు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా?....

Published : 27 Apr 2022 01:55 IST

చెవి వద్ద వేలితో తడితే ఇయర్‌ ఫోన్‌ ఆన్‌! మరోసారి తాకితే ఆఫ్‌!! సౌండ్‌ పెంచుకోవాలంటే వేలిని పైకి జరిపితే చాలు. వేలిని కిందికి జరిపితే సౌండ్‌ తగ్గించుకోవచ్చు. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? గూగుల్‌ తయారుచేస్తున్న వినూత్న పరికరాల మాయాజాలమిది. ఇవి చర్మ సైగలకు అనుగుణంగా పనిచేస్తాయి మరి. అంటే స్మార్ట్‌వాచ్‌, ఇయర్‌ఫోన్‌ లాంటి పరికరాల పక్కన చర్మాన్ని తాకటం వంటి వాటి చర్యలకు స్పందిస్తాయన్నమాట. అంతా వీటిల్లోని ‘స్కిన్‌ ఇంటర్ఫేస్‌’ పరిజ్ఞానం మహత్తు. ఇది ప్రత్యేక సెన్సర్లతో కూడుకొని ఉంటుంది. సాధారణంగా చర్మాన్ని వేలితో తాకినప్పుడు స్వల్పంగా యాంత్రిక తరంగాలు పుట్టుకొస్తుంటాయి. వీటిని పరికరాల్లోని సెన్సర్లు లోపలికి చేరవేస్తాయి. అనంతరం ఈ కదలికల సమాచారం కమాండ్స్‌గా మారుతుంది. ఇవి పరికరాలతో కావాల్సిన పనులను చేయించుకోవటానికి వీలు కల్పిస్తాయి. వేలితో చర్మాన్ని తాకే తీరు, తీవ్రత, జరిపే దిశ వంటివి రకరకాల కమాండ్స్‌గా ఉపయోగపడటం గమనార్హం. ఇవే ఫోన్‌ కాల్‌ చేయటం, సౌండ్‌ను మార్చుకోవటం, ప్లేబ్యాక్‌ లాంటి పనులెన్నో చేసి పెడతాయి. అందుకే ఈ పరిజ్ఞానం భవిష్యత్తులో శరీరానికి ధరించే పరికరాల రూపురేఖలనే మార్చేయగలదని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని