ఆఫ్‌లైన్‌లోనూ గూగుల్‌ డాక్స్‌

గూగుల్‌ డాక్స్‌లో పనిచేస్తున్నారు. అంతలో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పోయింది. లేదూ ఏ మారుమూల ప్రాంతంలోనో ఇంటర్నెట్‌ అసలే అందుబాటులో లేదు

Published : 15 Nov 2023 01:16 IST

గూగుల్‌ డాక్స్‌లో పనిచేస్తున్నారు. అంతలో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పోయింది. లేదూ ఏ మారుమూల ప్రాంతంలోనో ఇంటర్నెట్‌ అసలే అందుబాటులో లేదు. మరెలా? ఆఫ్‌లైన్‌లోనూ ఆగకుండా పనిచేసుకోవచ్చు. దీనికీ గూగుల్‌ డాక్స్‌ అవకాశం కల్పించింది. దీని సాయంతో డాక్యుమెంట్‌ను సృష్టించొచ్చు, సవరించొచ్చు, సమీక్షించొచ్చు. మరి ఈ ఆఫ్‌లైన్‌ సదుపాయాన్ని ఎనేబుల్‌ చేసుకోవటమెలా?

మొబైల్‌ ఫోన్‌లో..

  • గూగుల్‌ డాక్స్‌ యాప్‌ను తెరవాలి.
  • పైన కుడి మూలన మూడు చుక్కల మీద తాకాలి.
  •  అనంతరం సెటింగ్స్‌లోకి వెళ్లాలి.
  •  ఆఫ్‌లైన్‌ యాక్సెస్‌ను ఎంచుకోవాలి.
  •  ‘ఆఫ్‌లైన్‌ యాక్సెస్‌’ పక్కన ఉండే స్విచ్‌ను ఆన్‌ చేసుకోవాలి.

కంప్యూటర్‌లో..

గూగుల్‌ డ్రైవ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. పైన కుడి మూలన చక్రం గుర్తును నొక్కాలి. సెటింగ్స్‌ను ఎంచుకోవాలి. ఆఫ్‌లైన్‌ విభాగంలో ‘క్రియేట్‌, ఓపెన్‌, అండ్‌ ఎడిట్‌ యువర్‌ రీసెంట్‌ గూగుల్‌ డాక్స్‌, షీట్స్‌, అండ్‌ స్లైడ్స్‌ ఫైల్స్‌ ఆన్‌ దిస్‌ డివైస్‌ వైల్‌ ఆఫ్‌లైన్‌’ అని రాసిన బాక్సును ఎంచుకోవాలి. సేవ్‌ ఛేంజెస్‌ మీద క్లిక్‌ చేయాలి.

ఒకసారి దీన్ని ఎనేబుల్‌ చేసుకుంటే ఇంటర్నెట్‌ అనుసంధానం లేకపోయినా రీసెంట్‌ గూగుల్‌ డాక్స్‌ డాక్యుమెంట్లను ఓపెన్‌ చేయొచ్చు, సవరించుకోవచ్చు. ఒకవేళ డాక్యుమెంట్‌ పక్కన బూడిద రంగు గుర్తు లేకపోతే ఆఫ్‌లైన్‌ ఆప్షన్‌ అందుబాటులో లేదనుకోవచ్చు. అప్పుడు డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఆఫ్‌లైన్‌ ఆప్షన్‌ అందుబాటులోకి తెచ్చుకోవాలి. ఇందుకోసం డాక్యుమెంట్‌ పక్కన మూడు చుక్కల మీద తాకి ‘మేక్‌ ఎవైలబుల్‌ ఆఫ్‌లైన్‌’ను ఎంచుకోవాలి. ఒకసారి ఆఫ్‌లైన్‌లో గూగుల్‌ డాక్స్‌ డాక్యుమెంట్‌ను ఓపెన్‌ చేశాక సవరించుకోవచ్చు. చేసిన మార్పులు పరికరంలోనే సేవ్‌ అవుతాయి. ఇంటర్నెట్‌ అందుబాటులోకి రాగానే గూగుల్‌ డ్రైవ్‌కు మార్పులు సింక్‌ అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని