ఛార్జింగ్‌ స్టేషన్‌ ఎక్కడ?

విద్యుత్‌ వాహనాల వాడకం పెరుగుతున్నకొద్దీ ఛార్జింగ్‌ స్టేషన్ల అవసరమూ ఎక్కువవుతోంది. వీటి గురించిన ప్రత్యక్ష సమాచారాన్ని తెలియజేయటానికి బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిసియెన్సీ (బీఈఈ) మొబైల్‌ యాప్‌తో పాటు వెబ్‌ పోర్టల్‌నూ రూపొందిస్తోంది.

Updated : 28 Sep 2022 10:54 IST

విద్యుత్‌ వాహనాల వాడకం పెరుగుతున్నకొద్దీ ఛార్జింగ్‌ స్టేషన్ల అవసరమూ ఎక్కువవుతోంది. వీటి గురించిన ప్రత్యక్ష సమాచారాన్ని తెలియజేయటానికి బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిసియెన్సీ (బీఈఈ) మొబైల్‌ యాప్‌తో పాటు వెబ్‌ పోర్టల్‌నూ రూపొందిస్తోంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు సమీపంలో అందుబాటులో ఉన్న ఛార్జింగ్‌ స్టేషన్ల సమాచారాన్ని అప్పటికప్పుడు తెలియజేయటం వీటి ఉద్దేశం. ఇది దూర ప్రయాణాలు చేసేవారికి బాగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. ఆయా చోట్ల విద్యుత్‌ స్తంభాలకు స్మార్ట్‌ మీటర్లు అమర్చటం, జాతీయ రహదారుల పక్కన చిన్న చిన్న ఛార్జింగ్‌ స్టేషన్లు నెలకొల్పటం మీదా ప్రభుత్వం దృష్టి సారించింది. బ్యాటరీలను ఛార్జ్‌ చేసుకోవటానికి వాహనదారులకు స్మార్ట్‌ కార్డులూ అందజేస్తారు. వీటితో ఎక్కడైనా వాహనాలను ఛార్జ్‌ చేసుకోవటానికి వీలుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని