వినోద ఏఐ!
చూస్తుండగానే కృత్రిమ మేధ (ఏఐ) మన జీవితాల్లో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఊహలకు రెక్కలు తొడుగుతూ, సృజనాత్మకతను కొత్త పుంతలు తొక్కిస్తోంది.
చూస్తుండగానే కృత్రిమ మేధ (ఏఐ) మన జీవితాల్లో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఊహలకు రెక్కలు తొడుగుతూ, సృజనాత్మకతను కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఛాట్‌జీపీటీ, బార్డ్, బింగ్ వంటి వాటిని ఎంతోమంది ఉద్యోగ, వ్యక్తిగత, వ్యాపార అవసరాలకు వాడుకుంటున్నారు. ఎంతసేపూ సంక్లిష్ట ఆల్గోరిథమ్‌లు, డేటా విశ్లేషణ వంటివేనా? వినోదం కోసమూ ఏఐ ఉపయోగపడుతోంది. మన మాటలను సెలబ్రిటీల గొంతులో వినిపించటం, రూపాలను ప్రముఖుల ఆకారాల్లోకి మార్చటం వంటి చిత్రాలెన్నో చేస్తున్నారు. అలాంటి కొన్ని వినోదాత్మక ఏఐ టూల్స్ ఇవిగో..
నచ్చిన పుస్తకాలకు నప్పే ప్లేలిస్ట్
నచ్చిన పుస్తకం చదువుతున్నప్పుడు దానికి నప్పే సంగీతాన్ని, పాటలనూ వింటుంటే? ఆ అనుభూతే వేరు. అయితే ఆయా పుస్తకాలకు సరిపడిన ప్లేలిస్ట్‌ను రూపొందించటమంటే మాటలు కాదు. ఎన్నో జానర్లు తెలిసుండాలి. థీమ్‌ను గుర్తించాలి. అంత శ్రమ పడకుండా, చిటికెలోనే పని పూర్తయితే? మ్యూజిఫై (Muzify.ai) అలాంటి పనే చేసి పెడుతుంది. ఇది ఏఐ సాయంతో ఇష్టమైన పుస్తకాలు, నవలలు, రచయితల నేపథ్యానికి అనుగుణమైన స్పోటిఫై ప్లేలిస్ట్‌ను సెకండ్లలోనే సృష్టించేస్తుంది. ఆయా కథలు, మూడ్‌కు తగిన సంగీతం, పాటల జాబితాను ముందుంచుతుంది. ఇందులో సృష్టించుకున్న ప్లేలిస్టును మెయిల్ ద్వారా పంపించుకోవచ్చు. స్పోటిఫై ఖాతా ఉంటే దానిలో జతచేసి హాయిగా వినొచ్చు. అటు సాహిత్యాన్ని ఇటు ఆహ్లాదకర సంగీతాన్ని రెండింటినీ మేళవించి ఆనందించొచ్చు.
ఈమెయిల్ మంచిగా..
భాషా సాంకేతికతలో యాంగ్రీ ఈమెయిల్ ట్రాన్స్‌లేటర్‌ను (shttps://angryemail translator.comz )విచిత్ర మలుపుగా చెప్పుకోవచ్చు. కోపం, చిరాకుతో ఎవరికైనా ఈమెయిల్ రాసినా ఇది దాన్ని మర్యాద పూర్వకమైన భాషలోకి మార్చేస్తుంది మరి. ఇలా మనసును తెలిక పరచు కోవటానికీ దారి చూపుతుంది. దీనిలోని ఏఐ ఆల్గోరిథమ్‌లు.. ముఖ్యంగా పొలైట్‌నెస్ ఎన్‌హాన్స్‌మెంట్ అనే ఈమెయిల్ అసిస్టెంట్ టూల్ భాషలోని ఉద్రిక్త స్వభావాన్ని విశ్లేషించి, అవే భావాలను మరింత మన్ననతో కూడిన విధంగా వ్యక్తీకరించేలా ప్రత్యామ్నాయ పదాలను సూచిస్తుంది. తర్వాత చిక్కులు తలెత్తకుండా కాపాడుతుంది. యాంగ్రీ ఈమెయిల్ ట్రాన్స్‌లేటర్ పూర్తిగా ఉచితం. ఎవరైనా తేలికగా వాడుకోవచ్చు.
భలే బహుమతి
పుట్టిన రోజు, పెళ్లి రోజు వంటి వేడుకల్లో బహుమతులు ఇవ్వటం పరిపాటే. కానీ అవతలివారికి నచ్చే, వారు ఆనందించే బహుమతిని ఎంపిక చేయటమే కష్టం. ఎలాంటి బహుమతి ఇవ్వాలో తెలియక కొన్నిసార్లు తెగ ఇబ్బంది పడుతుంటాం కూడా. ఎవరి సలహానైనా తీసుకుంటే బాగుంటుందేమోననీ అనిపిస్తుంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే గిఫ్ట్ ఏఐ వెబ్‌సైట్ (sgiftassistant.ioz ) తోడ్పడుతుంది. అవతలివారి ఇష్టాయిష్టాలను గుర్తించి, మన బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని, సందర్భానికి అనుగుణమైన బహుమతిని ఎంపిక చేస్తుంది. బహుమతిని అందుకునేవారు మనకు ఏమవుతారు? వారి అభిరుచులేంటి? వ్యాపకాలేంటి? వంటి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే చాలు. మెషిన్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్రక్రియలతో విశ్లేషించుకొని, మంచి బహుమతులను గుర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో వాటిని అమ్మే వెబ్‌సైట్లకూ తీసుకెళ్తుంది.
సరదా వేదిక
స్నేహితులు ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇక్కడి నుంచే వారితో సరదాగా ఆటలాడుకుంటే? కలిసి పజిల్స్ పూర్తిస్తే? రకరకాల ప్రశ్నలు వేస్తూ జవాబులు తెలుసుకుంటే? బూమ్ ఏఐ (https://booom.ai) అలాంటి అవకాశమే కల్పిస్తుంది. ఇందులో ప్లేరూమ్‌ను సృష్టించుకొని, క్యూఆర్ కోడ్ ద్వారా అవతలివారిని ఆహ్వానించటమే తరువాయి. క్విజ్‌ల దగ్గర్నుంచి ఫన్ ఫ్యాక్ట్స్ వరకూ తమకు నచ్చిన గేమ్స్‌ను సృష్టించుకొని ఆడుకోవచ్చు. ఉదాహరణకు- క్విజ్‌ను సృష్టించాలను కున్నారనుకోండి. అంశాన్ని ఎంచుకుంటే కొద్ది సెకండ్లలోనే 10 ప్రశ్నలు ముందుంటాయి. ఇందులో టైమర్ కూడా ఉంటుంది. బూమ్ ఏఐలో ప్లేరూమ్‌ను సృష్టించుకొని ఇద్దరి నుంచి 8 మంది వరకు ఆడుకోవచ్చు. గేమ్ కార్డ్సును కూడా ఇష్టమున్న రంగులోకి మార్చుకోవచ్చు. పిక్చర్, గిఫ్స్‌ను జోడించుకోవచ్చు. కంటెంట్‌నూ ఎడిట్ చేసుకోవచ్చు.
పాడ్‌కాస్ట్ తేలికగా
చాలాకాలంగా మనసులో ఏదో తొలుస్తోంది. దాన్ని పాడ్‌కాస్ట్ రూపంలో పదిమందికీ చెప్పాలనుకుంటున్నారు. కానీ అదెలా చేయాలో తెలియటం లేదు. ఇలాంటి సమయంలో పాడ్‌క్యాజిల్ (https://podcastle.ai/) బాగా ఉపయోగ పడుతుంది. స్టుడియో నాణ్యతో కూడిన రికార్డింగు, ఏఐ ఆధారిత ఎడిటింగ్, సరళమైన ఎక్స్‌పోర్టింగ్ అన్నింటినీ ఇది చేసి పెడుతుంది. దీని ద్వారా ఆన్‌లైన్‌లో 10 మందితో ఇంటర్వ్యూ చేయొచ్చు. లేదూ ఒక్కరే షో నిర్వహించొచ్చు. అక్షరాలను మాటలుగా మార్చే ఏఐ పరిజ్ఞానంతో పాడ్‌కాస్ట్‌నూ సృష్టించుకోవచ్చు. ఉదాహరణకు ఏదైనా పరిశోధన పత్రాన్ని చదవటం బోర్‌గా అనిపిస్తే దీంతో పాడ్‌కాస్ట్‌గా లేదా ఆడియోబుక్‌గా మార్చేసుకోవచ్చు. టెక్స్ట్‌ను అప్‌లోడ్ చేసి, ఏఐ గొంతును ఎంచుకొని, ఎక్స్‌పోర్ట్ బటన్‌ను క్లిక్ చేస్తే చాలు. ఎలాంటి పరిశోధన పత్రాన్నయినా ఇట్టే వినేయొచ్చు.
విచిత్ర మెమేల పుట్ట
ఫొటోల నుంచి విచిత్రమైన మెమేలను సృష్టించుకోవాలనుకునే వారికి మెమే స్విఫ్ట్ (https://memeswift.com) మంచి సాధనం. ఇది చాలా తేలికగా, త్వరగా మామూలు ఫొటోలను విచిత్రమైన, వినోదాత్మకమైన మెమేలుగా మార్చేస్తుంది. ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మెమేలనే కాదు.. ఫొటోలకు క్యాప్షన్లనూ సృష్టిస్తుంది. దీన్ని వాడుకోవటం తేలిక. మెమేగా మార్చాలనుకునే ఫొటోను అప్‌లోడ్ చేసి.. భాషను, సందర్భాన్ని ఎంచుకుంటే చాలు. ఇది జెపీజీ, జేపెగ్, వెబ్‌పీ వంటి రకరకాల ఫార్మట్ల ఇమేజ్‌లను సపోర్టు చేస్తుంది. ఇమేజ్‌ను అప్‌లోడ్ చేశాక సేవ్ అండ్ క్లోజ్‌ను ఎంచుకోగానే మెమేస్విఫ్ట్ తన ఇంద్రజాలాన్ని మొదలెడుతుంది. సామాజిక మాధ్యమాల్లో హాస్యాన్ని జోడించుకోవాలని, వినోదం పంచాలని అనుకునేవారికిది బాగా ఉపయోగ
పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి