డాక్యుమెంట్‌లో డిజిటల్‌ సంతకం

గూగుల్‌ డాక్యుమెంట్ల మీద డిజిటల్‌ సంతకం చేయాలనుకుంటున్నారా? ఇందుకు బిల్టిన్‌గా ఉండే ఇ-సిగ్నేచర్‌ టూల్స్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈమెయిల్‌ మెసేజ్‌లు, ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్ల ధ్రువీకరణ కోసం డిజిటల్‌ సంతకాల అవసరం పెరిగిపోతున్న తరుణంలో దీని గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం.

Published : 31 Jan 2024 00:03 IST

గూగుల్‌ డాక్యుమెంట్ల మీద డిజిటల్‌ సంతకం చేయాలనుకుంటున్నారా? ఇందుకు బిల్టిన్‌గా ఉండే ఇ-సిగ్నేచర్‌ టూల్స్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈమెయిల్‌ మెసేజ్‌లు, ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్ల ధ్రువీకరణ కోసం డిజిటల్‌ సంతకాల అవసరం పెరిగిపోతున్న తరుణంలో దీని గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం.

డ్రాయింగ్‌ టూల్‌తో..

  • సంతకం చేయాలనుకునే గూగుల్‌ డాక్యుమెంట్‌ను ఓపెన్‌ చేయాలి. పైన టూల్‌బార్‌లో కనిపించే ఇన్‌సర్ట్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • కర్సర్‌ను డ్రాయింగ్‌ టూల్‌ మీద పెట్టి ‘ప్లస్‌ న్యూ’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అప్పుడు కొత్త విండో తెరచుకుంటుంది.
  • ఇందులో లైన్‌ టూల్‌ మీద క్లిక్‌ చేసి, డ్రాప్‌ డౌన్‌ మెనూ నుంచి స్క్రైబుల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీని సాయంతో మౌజ్‌ లేదా టచ్‌స్క్రీన్‌ ఉపయోగించి సంతకం చేయాలి.
  • అనంతరం సేవ్‌ అండ్‌ క్లోజ్‌ మీద క్లిక్‌ చేస్తే సంతకం ఇన్‌సర్ట్‌ అవుతుంది. దీన్ని డాక్యుమెంట్‌లో ఇష్టమైన చోట రీసైజ్‌ చేసుకొని, అమర్చుకోవచ్చు.

సంతకం ఫొటో అప్‌లోడ్‌

డిజిటల్‌ సంతకం చేయొద్దని అనుకుంటే సంతకం ఫొటోను ఇన్‌సర్ట్‌ చేసుకునే సదుపాయమూ ఉంది.

  • సంతకం ఫొటోను తీసుకొని, దాన్ని గూగుల్‌ డ్రైవ్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలి. లేదా కంప్యూటర్‌లో అయినా సేవ్‌ చేసుకోవచ్చు.
  • డాక్యుమెంట్‌ను ఓపెన్‌ చేసి, పై టూల్‌బార్‌లో ఇన్‌సర్ట్‌ బటన్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇమేజ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • దీనికి సంతకం ఫొటోను యాడ్‌ చేయాలి. డాక్యుమెంట్‌లో ఇష్టమైన చోట అమర్చుకొని, రీసైజ్‌ చేసుకోవాలి.

థర్డ్‌ పార్టీ యాప్‌లతో..

ఇన్‌బిల్ట్‌ టూల్స్‌ సరిపోకపోతే థర్డ్‌ పార్టీ ఎక్స్‌టెన్షన్ల సాయం తీసుకోవచ్చు. ఇవి డిజిటల్‌ సంతకాలను సృష్టించుకోవటానికే కాకుండా ఇతరత్రా బోలెడన్ని సదుపాయాలూ కల్పిస్తాయి. గూగుల్‌ డాక్స్‌లో పైన కనిపించే బార్‌లో ఎక్స్‌టెన్షన్స్‌ మీద క్లిక్‌ చేయాలి. డ్రాప్‌డౌన్‌ మెనూలో యాడ్‌ ఆన్స్‌ మీద క్లిక్‌ చేసి, గెట్‌ యాడ్‌ ఆన్స్‌ను ఎంచుకోవాలి. అప్పుడు గూగుల్‌ వర్క్‌స్పేస్‌ మార్కెట్‌ప్లేస్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో డిజిటల్‌ సంతకాలను సృష్టించే, యాడ్‌ చేసే చాలా ఎక్స్‌టెన్షన్లు కనిపిస్తాయి. వీటిని వాడుకోవటమూ తేలికే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని