WhatsApp: వాట్సప్‌లో సత్వర వీడియో సందేశాలు

వాట్సప్‌లో వాయిస్‌ మెసేజ్‌లు కొత్తేమీ కాదు. అప్పటికప్పుడు మాటలను రికార్డు చేసి మిత్రులకు, బృందాలకు షేర్‌ చేసుకోవటం తెలిసిందే. దీంతో పెద్ద పెద్ద టెక్స్ట్‌ మెసేజ్‌లు రాసే అవసరం తప్పుతుంది

Updated : 02 Aug 2023 11:38 IST

వాట్సప్‌లో వాయిస్‌ మెసేజ్‌లు కొత్తేమీ కాదు. అప్పటికప్పుడు మాటలను రికార్డు చేసి మిత్రులకు, బృందాలకు షేర్‌ చేసుకోవటం తెలిసిందే. దీంతో పెద్ద పెద్ద టెక్స్ట్‌ మెసేజ్‌లు రాసే అవసరం తప్పుతుంది. మరి దీనిలాగే  వీడియో మెసేజ్‌లనూ అప్పటికప్పుడు రికార్డు చేసి, సెండ్‌ చేసుకుంటే? వాట్సప్‌ కొత్తగా ఈ సదుపాయాన్నీ ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికే ఆరంభమైంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ వీడియో మెసేజ్‌లు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో భద్రంగా ఉంటాయని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగదని వాట్సప్‌ చెబుతోంది. ఈ కొత్త ఫీచర్‌ ద్వారా 60 సెకండ్ల నిడివి గల వీడియో సందేశాలను పంపించొచ్చు. వాట్సప్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, కెమెరా ఆప్షన్‌ మీద క్లిక్‌ చేసి వీడియో క్లిప్‌ను రికార్డు చేసుకోవచ్చు. దాన్ని వ్యక్తులకు, బృందాలకు పంపించొచ్చు. ఈ వీడియో సందేశాలు అందినప్పుడు వాట్సప్‌ ఛాట్‌లో అవి వాటంతటవే ప్లే అవుతాయి. కాకపోతే శబ్దం వినిపించదు. వీడియో మీద తాకితే సౌండ్‌ వినిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని