వాట్సప్‌ ఛానల్‌ ఎలా?

వాట్సప్‌ ఇటీవల మనదేశంలో ఛానల్స్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా సంస్థలు, క్రీడా బృందాలు, కళాకారులు, మేధావులు తమ ఛానల్‌ను ఆరంభించి అప్‌డేట్స్‌ అందించొచ్చు. ఇది ఒకవైపు నుంచే సాగే వ్యవహారమే. అంటే యూజర్లు ఆయా ఛానల్స్‌ను ఫాలో అవుతారన్నమాట.

Published : 04 Oct 2023 00:12 IST

వాట్సప్‌ ఇటీవల మనదేశంలో ఛానల్స్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని ద్వారా సంస్థలు, క్రీడా బృందాలు, కళాకారులు, మేధావులు తమ ఛానల్‌ను ఆరంభించి అప్‌డేట్స్‌ అందించొచ్చు. ఇది ఒకవైపు నుంచే సాగే వ్యవహారమే. అంటే యూజర్లు ఆయా ఛానల్స్‌ను ఫాలో అవుతారన్నమాట. ఇష్టమైన ఛానళ్లను వెతికి యూజర్లు ఫాలో కావొచ్చు. ఎమోజీల ద్వారా ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వచ్చు. ఛానల్‌ ఫాలోయర్ల ఫోన్‌ నంబరు, ప్రొఫైల్‌ ఇమేజ్‌ అడ్మిన్లకు గానీ ఇతర ఫాలోయర్లకు గానీ కనిపించవు. ఛానల్స్‌ అప్‌డేట్స్‌ను ఛాట్స్‌ లేదా గ్రూపులకు ఫార్వర్డ్‌ చేసినప్పుడు వాటి లింక్‌ కూడా అందుతుంది. ఛానల్స్‌లో షేర్‌ చేసిన అప్‌డేట్స్‌ 30 రోజుల వరకే సేవ్‌ అవుతాయి. అయితే ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. కొందరికే అందుబాటులోకి తెచ్చారు. మరి ఛానల్స్‌ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలి?

  • వాట్సప్‌ ఛానల్స్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్‌డేట్స్‌ విభాగంలోకి వెళ్లాలి. ఇందులో ఛానల్స్‌ పక్కనుండే ప్లస్‌ గుర్తు మీద నొక్కితే క్రియేట్‌ ఛానల్స్‌, ఫైండ్‌ ఛానల్స్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. క్రియేట్‌ ఛానల్స్‌తో ఛానల్‌ను సృష్టించుకోవచ్చు. దీని మీద తాకి, కంటిన్యూ బటన్‌ను నొక్కాలి. తెర మీద కనిపించే సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలి. ఛానల్‌కు పేరు పెట్టుకోవాలి. కావాలనుకుంటే తర్వాత పేరు మార్చుకోవచ్చు. ఛానల్‌ దేనికి సంబంధించిందో చిన్న వివరణ రాసుకోవాలి. ఛానల్‌ గుర్తుగా ఫోన్‌లో ఉన్న ఫొటోను గానీ ఇంటర్నెట్‌ నుంచి తీసుకున్న ఫొటోను గానీ సెట్‌ చేసుకోవచ్చు. ఇవన్నీ పూర్తయ్యాక క్రియేట్‌ ఛానల్‌ బటన్‌ మీద క్లిక్‌ చేస్తే సరి.
  • ఫైండ్‌ ఛానల్స్‌ ఆప్షన్‌ను తాకితే అందుబాటులో ఉన్నవన్నీ కనిపిస్తాయి. ఛానల్‌ పేరు తెలిసి ఉంటే సెర్చ్‌ చేసి, కనుక్కోవచ్చు. ఛానల్‌ పక్కనుండే ప్లస్‌ గుర్తును తాకి ఫాలో కావొచ్చు. లేదూ ఛానల్‌ను ఓపెన్‌ చేసి అయినా ఫాలో కావొచ్చు. ఒకవేళ అది నచ్చకపోతే- ఛానల్‌ పేజీ మీద పైన కుడివైపున ఉండే నిలువు మూడు చుక్కలను తాకి, అన్‌ఫాలో ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని