వాట్సప్‌తో స్టోరేజీ నిండుకుంటోందా?

వాట్సప్‌లో బోలెడన్ని కాంటాక్టులు, గ్రూపులు. రోజూ ఎన్నెన్నో ఫొటోలు, వీడియోలు వచ్చి చేరుతుంటాయి. క్లిక్‌ చేయగానే అన్నీ డౌన్‌లోడ్‌ అయిపోతాయి. వాటిని చూడనంతవరకు మనసు నిలవదాయె మరి.

Updated : 20 Dec 2023 01:23 IST

వాట్సప్‌లో బోలెడన్ని కాంటాక్టులు, గ్రూపులు. రోజూ ఎన్నెన్నో ఫొటోలు, వీడియోలు వచ్చి చేరుతుంటాయి. క్లిక్‌ చేయగానే అన్నీ డౌన్‌లోడ్‌ అయిపోతాయి. వాటిని చూడనంతవరకు మనసు నిలవదాయె మరి. మరోపక్క స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజీ నిండుకుంటోందనే బెంగా మొదలవుతుంది. స్టోరేజీ నిండుకుంటే ఫోన్‌ వేగం నెమ్మదిస్తుంది కదా. మరెలా? దీనికి ఉపాయం లేకపోలేదు. మీడియా ఫైళ్లు తమకుతామే సేవ్‌ కాకుండా చూసుకుంటే సరి. ఇందుకోసం..

* వాట్సప్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, పైన కుడి వైపున కనిపించే మూడు నిలువు చుక్కల మీద క్లిక్‌ చేయాలి. సెటింగ్స్‌ ద్వారా ఛాట్‌లోకి వెళ్లాలి. ఇందులో మీడియా విజిబిలిటీ సదుపాయం పక్కనుండే మీటను ఆఫ్‌ చేయాలి. అప్పుడు మీడియా పైలు ఆటోమేటిక్‌గా గ్యాలరీలో సేవ్‌ అవటం ఆగుతుంది. అలాగని డౌన్‌లోడ్‌ అయిన ఫైలేమీ మారదు. మామూలుగానే కనిపిస్తుంది. గ్రూప్‌ ఛాట్‌లోనూ ఇలాంటి మార్పు చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని