డూప్లికేట్‌ ఫొటోలు పోయేలా..

కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ఫోన్లలో డూప్లికేట్‌ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి.

Published : 03 Jan 2024 00:08 IST

కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ఫోన్లలో డూప్లికేట్‌ ఫొటోలు, ఫైళ్లు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఇవి అచ్చం నిజమైన ఫైళ్ల మాదిరిగానే కాకుండా వాటిని దాదాపు పోలినట్టుగానూ ఉండొచ్చు. వీటిని తొలగించటానికి ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డిఫాల్ట్‌గా సదుపాయాలుంటాయి. కానీ అన్నిసార్లూ ఇవి సరిపోకపోవచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని టూల్స్‌ సాయం తీసుకోవచ్చు.

డూప్లికేట్‌ క్లీనర్‌ ప్రో: విండోస్‌కు అందుబాటులో ఉండే సమగ్రమైన టూల్‌ ఇది. కంటెంట్‌, ఫైల్‌నేమ్‌, సైజ్‌, తేదీ వారీగా ఫైళ్లను స్కాన్‌ చేసి డ్లూప్లికేట్లను గుర్తిస్తుంది.

విసిపిక్స్‌: ఇది అధునాతన ఆల్గారిథమ్‌ల సాయంతో ఒకేలాంటి ఫొటోలను పట్టుకుంటుంది. ఫార్మాట్‌, సైజు, రెజల్యూషన్‌ వేర్వేరుగా ఉన్నా పని కానిచ్చేస్తుంది. ఇందులో స్ట్రిక్ట్‌నెస్‌ అనే ఫీచర్‌ను సెట్‌ చేసుకుంటే ఎంత వీలైతే అంత ఎక్కువగా సరిపోయే డూప్లికేట్‌ ఫొటోలను గుర్తిస్తుంది.

ఏవ్‌సమ్‌ డూప్లికేట్‌ ఫొటో ఫైండర్‌: కంటెంట్‌ ఆధారిత శోధన ఆల్గారిథమ్‌తో ఇది పనిచేస్తుంది. ఇంతకుముందు ఎడిట్‌ చేసినా, వేరే ఫార్మాట్‌లో సేవ్‌ చేసినా డూప్లికేట్‌ ఫొటోలను పట్టుకుంటుంది.

జాగ్రత్త: ఏ ఫొటోలనైనా సరే.. డిలీట్‌ చేసే ముందు ఓసారి సమీక్షించుకోవాలి. ఆటోమేటెడ్‌ టూల్స్‌ను ఉపయోగించేటప్పుడిది తప్పనిసరి. అలాగే ఫొటోలను బ్యాకప్‌ చేసుకొని పెట్టుకోవాలి. ముఖ్యమైన ఫొటోలను పొరపాటున డిలీట్‌ చేస్తే బ్యాకప్‌ నుంచి తిరిగి పొందటానికి వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని