మెదడును కనిపెట్టే వీఆర్ హెడ్‌సెట్
వినోదం కోసం వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్లు వాడుతూనే ఉంటాం. వీటిని వైద్యపరంగానూ వాడుకోగలిగితే? అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు అలాంటి ఘనతే సాధించారు.
వినోదం కోసం వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్లు వాడుతూనే ఉంటాం. వీటిని వైద్యపరంగానూ వాడుకోగలిగితే? అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు అలాంటి ఘనతే సాధించారు. మెదడు పనితీరును పసిగట్టే విధంగా వీఆర్ హెడ్‌సెట్‌ను తీర్చిదిద్దారు. ఒత్తిడి కారకాల వంటి బయటి అంశాలకు మెదడు ఎలా స్పందిస్తుందో తెలుసుకోవటానికిది ఉపయోగపడుతుండటం గమనార్హం. చర్మం మీదే అమర్చగల ఎలక్ట్రోఎన్‌కెఫలోగ్రామ్ (ఈఈజీ) సెన్సర్‌ను మెటా వీఆర్ హెడ్‌సెట్‌కు అమర్చారు. దీన్ని చాలాసేపు కళ్లకు ధరించినా ఇబ్బందేమీ ఉండదు. వర్చువల్ రియాలిటీ దృశ్యాలను చూస్తున్నప్పుడు మెదడు పనితీరును ఈఈజీ గ్రహిస్తుంది. దీన్ని ఆందోళన తగ్గించటానికి, ఏకాగ్రత తీరును తెలుసుకోవటానికి, ఫ్లయిట్ సిమ్యులేటర్‌తో మానసిక ఒత్తిడిని గుర్తించటానికి, రోబో కళ్లతో ప్రపంచాన్ని చూడటానికి.. ఇలా చాలారకాలుగా వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పెద్ద తెర కన్నా వర్చువల్ రియాలిటీలో దృశ్యాల్లో తేలికగా మునిగిపోతుంటారు. ఇది ప్రత్యక్ష అనుభూతిని కలిగిస్తుంది. అందువల్ల ఆయా పరిస్థితులు, వాతావరణాలకు ఎలా స్పందిస్తున్నారో స్పష్టంగా గుర్తించొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈఈజీ పరికరాలు ఎలక్ట్రోడ్లతో కూడిన టోపీ రూపంలో లభిస్తున్నాయి. చాలావరకు ఇవి గట్టిగా ఉంటాయి. ఎక్కువసేపు ధరించటం కష్టం. ఈఈజీ సెన్సర్‌తో కూడిన కొత్త వీఆర్ హెడ్‌సెట్‌తో ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. వీటిల్లో ఎలక్ట్రోడ్లు మృదువుగా ఉంటాయి. ఇవి నుదురుకు తాకి ఉంటాయి. హెడ్‌సెట్ వెనకాల ఉండే ఈఈజీ రికార్డింగు పరికరం మెదడు స్పందించే తీరును పసిగడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!