పెయింట్‌ కొత్తగా

మైక్రోసాఫ్ట్‌ పెయింట్‌ సరికొత్తగా ముస్తాబయ్యింది. ఫొటోషాప్‌ మాదిరిగా ట్రాన్స్‌పరెన్సీ, లేయర్స్‌ ఫీచర్లతో ముందుకొచ్చింది. వి11.2308.18.0 వర్షన్‌ లేదా ఆ తర్వాతి వర్షన్లతో వీటిని వాడుకోవచ్చు.

Published : 27 Sep 2023 00:34 IST

మైక్రోసాఫ్ట్‌ పెయింట్‌ సరికొత్తగా ముస్తాబయ్యింది. ఫొటోషాప్‌ మాదిరిగా ట్రాన్స్‌పరెన్సీ, లేయర్స్‌ ఫీచర్లతో ముందుకొచ్చింది. వి11.2308.18.0 వర్షన్‌ లేదా ఆ తర్వాతి వర్షన్లతో వీటిని వాడుకోవచ్చు. ప్రస్తుతానికివి కానర్స్‌ అండ్‌ డెవ్‌ ఛానెల్స్‌లో భాగంగా విండోస్‌ ఇన్‌సైడర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేయర్స్‌ ఫీచర్‌తో చాలా లేయర్లను సృష్టించుకోవచ్చు. వాటిని కనిపించేలా లేదా కనిపించకుండా చేయొచ్చు. డూప్లికేట్‌ చేసుకోవచ్చు. లేయర్లను కలిపేయొచ్చు. దీన్ని వాడుకోవాలంటే- టూల్‌బార్‌లోని కొత్త లేయర్‌ బటన్‌ను క్లిక్‌ చేస్తే ఇమేజ్‌కు కుడివైపున ప్యానెల్‌ ఓపెన్‌ అవుతుంది. దీని ద్వారా కొత్త లేయర్లను సృష్టించుకోవటం, మార్చుకోవటం చేసుకోవచ్చు. ఇక ట్రాన్స్‌పరెన్సీ ఫీచర్‌తో లేయర్‌లో అవసరమైన భాగాలను ఎరేజ్‌ చేయొచ్చు. కింద ఉన్న లేయర్లలోని దృశ్యాలు కనిపించేలా చేయొచ్చు. వెనక పొర రంగులను బ్యాక్‌గ్రౌండ్‌గా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రాన్స్‌పరెంట్‌ టూల్‌తో పీఎన్‌జీ ఫైళ్లనూ పెయింట్‌లో ఓపెన్‌ చేసి, సేవ్‌ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ రిమూవల్‌ టూల్‌తో తొలగించిన దృశ్యాల స్థానంలో కొత్త అంశాలను జోడించుకుంటే ఫొటోల అందం మరింత ఇనుమడించటం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని