ఎలక్ట్రానిక్‌ పరికరాలకూ స్పర్శ జ్ఞానం!

రోబోలకు స్పర్శ తెలిస్తే? అలాంటి జ్ఞానాన్ని కల్పించగల వినూత్న స్టికర్‌ను యూనివర్సిటీ ఆప్‌ కాలిఫోర్నియా సాన్‌డీగో శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పేరు ఫోర్స్‌స్టికర్‌. వైర్‌లెస్‌గా పనిచేసే దీనికి బ్యాటరీల అవసరమూ లేదు.

Updated : 18 Oct 2023 00:34 IST

రోబోలకు స్పర్శ తెలిస్తే? అలాంటి జ్ఞానాన్ని కల్పించగల వినూత్న స్టికర్‌ను యూనివర్సిటీ ఆప్‌ కాలిఫోర్నియా సాన్‌డీగో శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పేరు ఫోర్స్‌స్టికర్‌. వైర్‌లెస్‌గా పనిచేసే దీనికి బ్యాటరీల అవసరమూ లేదు. ఒక వస్తువు మీద మరో వస్తువు కలగజేసే బలాన్ని ఈ ఎలక్ట్రానిక్‌ స్టికర్‌ లెక్కిస్తుంది. అందుకే కృత్రిమ మోకాలు వంటి పరికరాలకు బాగా ఉపయోగ పడగలదని భావిస్తున్నారు. ప్యాకేజీల అడుగున కూడా వీటిని వాడుకోవచ్చు. దీంతో వాటి బరువును వెంటనే కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఫోర్స్‌స్టికర్‌లో రెండు భాగాలుంటాయి. ఒకటి బియ్యం గింజంత సైజు, కొద్ది మిల్లీమీటర్ల మందంతో కూడిన కెపాసిటర్‌. రెండోది రేడియోఫ్రీకెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ) స్టికర్‌. బార్‌కోడ్‌ మాదిరిగా పనిచేసే ఇది రేడియో సంకేతాల సాయంతో వైర్‌లెస్‌గా సమాచారాన్ని చదువుతుంది. ఈ ఫోర్స్‌ స్టికర్లు టెక్నాలజీ సాధనాలకు మరిన్ని తెలివితేటలను, అంతర్భుద్ధిని అందిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. మనకు సహజంగానే బలాన్ని గుర్తించే జ్ఞానం అబ్బుతుంది. చుట్టుపక్కల వస్తువుల తీరుతెన్నులను గుర్తించే సామర్థ్యం లభిస్తుంది. ఇలాంటి జ్ఞానాన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలకు, శరీరంలో అమర్చే కృత్రిమ పరికాలకు కల్పిస్తే పలు పరిశ్రమల్లో, నిత్యావసరాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని