Google: ఒక్క క్లిక్‌తో క్లౌడ్ డేటా.. ఎలాగంటే?

సెర్చ్‌ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మరో యాప్‌ సేవలను నిలిపివేయనుంది. ఇప్పటికే గూగుల్ ఫొటోస్‌లో ఉచిత స్టోరేజ్‌పై పరిమితి విధించిన గూగుల్ సెప్టెంబర్‌ చివరి నుంచి బ్యాక్‌అప్‌ అండ్ సింక్‌ యాప్‌ను తొలగించనుంది. దాని స్థానంలో కొత్తగా డ్రైవ్‌ ఫర్‌ డెస్క్‌టాప్ పేరుతో మరో ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు  వెల్లడించింది...

Published : 20 Jul 2021 21:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సెర్చ్‌ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మరో యాప్‌ సేవలను నిలిపివేయనుంది. ఇప్పటికే గూగుల్ ఫొటోస్‌లో ఉచిత స్టోరేజ్‌పై పరిమితి విధించిన గూగుల్ సెప్టెంబర్‌ చివరి నుంచి బ్యాక్‌అప్‌ అండ్ సింక్‌ యాప్‌ను తొలగించనుంది. దాని స్థానంలో కొత్తగా డ్రైవ్‌ ఫర్‌ డెస్క్‌టాప్ పేరుతో మరో ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. డ్రైవ్‌ ఫర్ డెస్క్‌టాప్‌కు సంబంధించి యూజర్స్ అందరికీ నోటిఫికేషన్లు వస్తాయని తెలిపింది. బ్యాక్‌అప్ ప్రాసెస్‌ను సులభతరం చేయడం కోసం గూగుల్ 2017లో బ్యాక్‌అప్‌ అండ్‌ సింక్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా ఫొటోలు, ఫైల్స్‌ని భద్రపరచుకోడంతో పాటు డివైజ్‌లో ఉన్న మొత్తం సమాచారాన్ని కూడా బ్యాక్‌అప్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ ఫొటోస్, డ్రైవ్‌ని సపోర్ట్ చేస్తుంది. 

తాజాగా సరికొత్త ఫీచర్లతో డ్రైవ్‌ ఫర్ డెస్క్‌టాప్‌ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ ఫీచర్‌ కొద్ది మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ‘‘డెస్క్‌టాప్‌ నుంచి డైరెక్ట్‌గా గూగుల్ డ్రైవ్ ఫోల్డర్‌లోని సమాచారాన్ని పొందాలనుకునే యూజర్స్‌కి డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మీ డెస్క్‌టాప్‌ స్క్రీన్‌ నుంచి క్లౌడ్‌లోని సమాచారం మొత్తం సులువుగా యాక్సెస్ చెయ్యొచ్చు. దానివల్ల మీ కంప్యూటర్ స్టోరేజ్‌లో ఎప్పుడూ కొంత స్పేస్ ఉంటుంది’’ అని గూగుల్ తన బ్లాగ్‌లో పేర్కొంది. విద్య, వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం గూగుల్ డ్రైవ్‌ను ఎక్కువగా ఉపయోగించేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దానివల్ల తమ సమాచారాన్ని యాక్సెస్ చేసుకునేందుకు వేర్వేరు యాప్‌లు, డివైజ్‌ల అవసరంలేకుండా మొత్తం ఫైల్స్‌ని ఒకే చోటు నుంచి కావాల్సినప్పడు ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని