Windows 11: కొత్త ‘విండోస్‌’ కుమ్మేసిందిగా!

విండోస్‌11 లో ఆండ్రాయిడ్‌ యాప్స్‌... ఇంకా ఎన్నో ఆప్షన్స్‌

Updated : 25 Jun 2021 19:31 IST

ఈసారి వచ్చే విండోస్‌లో కొత్త వెర్షన్‌ మామూలుగా ఉండదని మైక్రోసాఫ్ట్‌ చాలా రోజుల నుంచి చెబుతూనే ఉంది. తాజాగా విండోస్‌ 11 పేరుతో కొత్త ఓఎస్‌ను లాంచ్‌ చేశారు. అందులో కీలక ఫీచర్లు మీ కోసం.. 


విండోస్‌ 11లో స్టార్ట్‌ మెనూను ఎడమవైపు నుండి సెంటర్‌కు తీసుకొచ్చారు. అంటే స్టార్ట్‌ బటన్‌ క్లిక్‌ చేయగానే... యాప్స్‌ లిస్ట్‌ స్క్రీన్‌ సెంటర్‌లో పాప్‌ అప్‌ అవుతుంది.  మ్యాక్‌ ఓఎస్‌, క్రోమ్‌ ఓఎస్‌లోనే ఇలానే ఉంటుంది. 


విండోస్‌ 10లో స్టార్ట్‌ మెనూ ఓపెన్‌ చేయగానే... ఐకాన్లు జిఫ్‌ల తరహాలో ఆటోప్లే అవుతుంటాయి. కొత్త ఓఎస్‌లో లైవ్‌ టైల్స్‌ స్థానంలో రౌండెడ్‌ కార్నర్స్‌తో  యాప్‌ ఐకాన్స్‌ను తీసుకొచ్చారు. 


కొత్త ఓఎస్‌లో స్నాప్‌ లేఅవుట్స్‌ అనే స్టైల్‌ తీసుకొస్తున్నారు. స్క్రీన్‌ మీద ఫోల్టర్‌/యాప్స్‌/సాఫ్ట్‌వేర్‌లను కావాల్సినట్లు అరేంజ్‌ చేసుకోవచ్చు. దీని కోసం డీఫాల్ట్‌గా ఆరు రకాల లేవుట్స్‌ ఇస్తున్నారు. మల్టీ టాస్కింగ్‌ చేసేవారి కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది.   


ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌లో తరహాలో  కొత్తగా సెర్చ్‌ డాక్యుమెంట్స్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. అంటే సెర్చ్‌లో యాప్స్‌/సాఫ్ట్‌వేర్స్‌తోపాటు డాక్యుమెంట్స్‌ కూడా కనిపిస్తాయి. ఇది మైక్రోసాఫ్ట్‌ 365 వినియోగదారులకు ఉపయుక్తంగా ఉంటుంది.


విండోస్‌ కంప్యూటర్లలో అప్‌డేట్‌లు వచ్చిన ప్రతిసారి.. రీస్టార్ట్‌ అంటూ పెద్ద పనే ఉంటుంది. ఒక్కోసారి నాలుగైదు సార్లు రీస్టార్ట్‌ అవుతుంది సిస్టమ్‌. అయితే విండోస్‌11లో ఆ సమస్య ఉండదట. ఎక్కువ శాతం బ్యాగ్రౌండ్‌లోనే అప్‌డేట్లు అయిపోతాయట. 


కొత్త ఓఎస్‌లో ఆటో హెచ్‌డీఆర్‌ ఫీచర్‌ ఉంటుంది. ఎక్స్‌బాక్స్‌లో గేమ్స్‌ ఆడేవారికి ఇది కొత్త అనుభూతినిస్తుందట. ల్యాపీలు, హెచ్‌డీ మానిటర్లు ఉన్న పీసీల్లో గేమింగ్‌ అనుభూతి కొత్తగా ఉంటుందట. 


విండోస్‌11లో మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను కూడా సపోర్టు చేస్తుంది. ఇందులోని అమెజాన్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ ఆధారిత యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 


విండోస్‌ 11ను ఈ ఏడాది నవంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు. విండోస్‌ 10 యూజర్లకు విండోస్‌ 11ను ఉచితంగా అప్‌డేట్‌ చేస్తారు. అయితే మీరు వాడుతున్నది జెన్యూన్‌ విండోస్‌ 10 అయి ఉండాలి. కొత్తగా విండోస్‌ 11ను ఇన్‌స్టాల్‌ చేయాలనుకునేవాళ్లు డబ్బులు చెల్లించాలి. 


విండోస్‌ 11 ఓఎస్‌ ఇన్‌స్టాల్‌/అప్‌డేట్‌ చేసుకోవాలంటే సిస్టమ్‌లో కొన్ని కనీస ఫీచర్లు ఉండాలి. సిస్టమ్‌ 64 బిట్‌ అయి ఉండాలి. కనీసం 1 జీహెచ్‌జెడ్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ అయి ఉండాలి. కనీసం 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఫ్రీ ‌ స్టోరేజీ ఉండాలి. 


మరిన్ని వివరాల కోసం దిగువ వీడియో చూడండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు