Chrome - Youtube: క్రోమ్‌, యూట్యూబ్‌ ఒకేసారి వాడాలంటే ఎలా?

యూబ్యూబ్‌లో ఏదో ఆసక్తికరమైన వీడియో చూస్తున్నారు. అంతలో క్రోమ్‌ బ్రౌజర్‌తో పనిపడింది. ఒకవైపు బ్రౌజర్‌ మీద పనిచేస్తూనే యూట్యూబ్‌ వీడియో చూడాలని అనిపించొచ్చు. అప్పుడెలా?యూట్యూబ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇష్టమైన వీడియోను ఎంచుకోవాలి....

Updated : 04 Aug 2022 14:10 IST

యూబ్యూబ్‌లో ఏదో ఆసక్తికరమైన వీడియో చూస్తున్నారు. అంతలో క్రోమ్‌ బ్రౌజర్‌తో పనిపడింది. ఒకవైపు బ్రౌజర్‌ మీద పనిచేస్తూనే యూట్యూబ్‌ వీడియో చూడాలని అనిపించొచ్చు. అప్పుడెలా?

డెస్క్‌టాప్‌ మీద..

యూట్యూబ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇష్టమైన వీడియోను ఎంచుకోవాలి.

వీడియో ప్లే అవుతుండగా దాని మీద ఎక్కడైనా రైట్‌ క్లిక్‌ చేయాలి. అయితే ఏ ఆప్షన్‌నూ ఎంచుకోవద్దు. వెంటనే తిరిగి వీడియో మీద మరోసారి రైట్‌ క్లిక్‌ చేయాలి.

ఈసారి వేరే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో ‘పిక్చర్‌ ఇన్‌ మోడ్‌’ను ఎంచుకోవాలి.

ఏ ట్యాబ్‌ మీద పనిచేస్తున్నారో దాన్ని ఎంచుకోవాలి. అప్పుడు యూట్యూబ్‌ మినీ ప్లేయర్‌ తెర మీద కనిపిస్తుంది. యూట్యూబ్‌ పేజీలోకి వెళ్లకుండానే మినీ ప్లేయర్‌ సైజును మార్చుకోవచ్చు. వీడియోను పాజ్‌ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్‌లో..

స్మార్ట్‌ఫోన్‌లోనైతే స్ప్లిట్‌ స్క్రీన్‌ మోడ్‌ను ఎంచుకోవాలి. యూట్యూబ్‌ యాప్‌ మీద కాసేపు అలాగే నొక్కి పట్టి, అలాగే లాగుతూ స్ప్లిట్‌ స్క్రీన్‌లోకి చేర్చుకోవాలి.

మరో స్ప్లిట్‌ స్క్రీన్‌ మీద క్రోమ్‌ను ఓపెన్‌ చేయాలి. ట్యాబ్‌ను ఎంచుకొని పనిచేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని