ఇన్‌స్టా అప్‌డేట్: ఇక ఒకేసారి నలుగురు లైవ్‌లోకి

కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఆన్‌లైన్‌ ఇంటరాక్షన్‌ ఎక్కువైపోయింది. దీంతో యాప్స్‌ ఎక్కువగా ఆ తరహా ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ వీడియో.....

Published : 03 Mar 2021 22:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా ఆన్‌లైన్‌ ఇంటరాక్షన్‌ ఎక్కువైపోయింది. దీంతో యాప్స్‌ ఎక్కువగా ఆ తరహా ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ వీడియో, ఫొటో షేరింగ్ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ సైతం అలాంటి ఓ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ‘లైవ్‌ రూమ్‌’ ఫీచర్‌ ద్వారా కేవలం ఒకరు మాత్రమే లైవ్‌లో మాట్లాడే అవకాశం ఉండేది. ఇక నుంచి నలుగురితో లైవ్‌ నిర్వహించుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటన చేసింది. టాక్‌ షోలు, సెషన్లు, ఆన్‌లైన్‌లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్స్‌ కార్యక్రమాలను నిర్వహించే వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఇన్‌స్టా పేర్కొంది. యూజర్లకు మరిన్ని వ్యాపార అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. 

యూజర్‌ కాకుండా మరో ముగ్గురు ‘లైవ్‌’ నిర్వహించొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ హోంపేజీ ఓపెన్‌ చేసి ఎడమ వైపు స్క్రీన్‌ను స్వైప్‌ చేయాలి. ‘లైవ్‌ కెమెరా’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. హోస్ట్‌గా వ్యవహరించే యూజర్‌ మరో ముగ్గురిని యాడ్‌ చేసే అవకాశం ఉంటుంది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో లైవ్‌ సెషన్స్‌కు ఎక్కువగా డిమాండ్ వచ్చిందని, ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్‌ను అందిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని