యూవీ శానిటైజేషన్‌తో ఇయర్‌బడ్స్‌..

కొవిడ్‌-19 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏ వస్తువు కొన్నా శానిటైజేషన్‌ తప్పనిసరయింది. దీంతో కంపెనీలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఎల్‌జీ కంపెనీ యూవీ శానిటైజేషన్‌ కేస్‌తో రెండు మోడల్స్‌ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది....

Updated : 05 Jan 2021 22:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఏ వస్తువు కొన్నా శానిటైజేషన్‌ తప్పనిసరయింది. దీంతో కంపెనీలూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఎల్‌జీ కంపెనీ యూవీ శానిటైజేషన్‌ కేస్‌తో రెండు మోడల్స్‌ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఎల్‌జీ టోన్‌ ఫ్రీ ఎఫ్‌ఎన్‌ 6 (హెచ్‌బీఎస్‌-ఎఫ్‌ఎన్‌6), టోన్‌ ఫ్రీ ఎఫ్‌ఎన్‌ 7 (హెచ్‌బీఎస్‌-ఎఫ్‌ఎన్‌7) పేరుతో వీటిని తీసుకొచ్చారు. ఈ ఇయర్‌బడ్స్‌లో మెరీడియన్‌ టెక్నాలజీ ఉపయోగించారు. దీనివల్ల యూజర్స్‌ అద్భుతమైన సౌండ్‌ క్వాలిటీని పొందుతారు. అలానే మెరుగైన కాలింగ్ క్వాలిటీ కోసం నాయిస్‌ రిడక్షన్, ఎకో కాన్సిలేషన్‌, డ్యూయల్‌ మైక్రోఫోన్స్ ఇస్తున్నారు.  

ఈ ఇయర్‌బడ్స్‌ కేస్‌లో యూవీ శానిటైజేషన్‌ లైట్‌ ఉంది. కేస్‌లో ఇయర్‌బడ్స్‌ని ఉంచినప్పుడు అందులోని యూవీ లైట్‌ వాటిని పూర్తిగా శానిటైజ్‌ చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫీచర్‌తో యూజర్స్‌కి ఎంతో మేలు జరుగుతుందని ఎల్‌జీ తెలిపింది. నీటిలో తడిచినా ఇవి పాడవకుండా ఐపీఎక్స్‌4 రేటింగ్ ఇస్తున్నారు. ప్రతి ఇయర్‌బడ్‌లో 55 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఆరు గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌లో 390 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల ఛార్జింగ్‌ టైమ్‌ లభిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది. టోన్‌ ఫ్రీ ఎఫ్‌ఎన్‌ 6 ధర రూ.24,990గా, టోన్‌ ఫ్రీ ఎఫ్‌ఎన్‌7 ధర రూ.29,990. ఎఫ్ఎన్‌ 6లో రెండు మైక్రోఫోన్లు, ఎఫ్ఎన్‌7లో మూడు మైక్రోఫోన్లు ఉండటం వల్లనే ధరలో వ్యత్యాసం.  

ఇవీ చదవండి..

ఈ స్మార్ట్‌వాచ్‌పై గీతలు పడవు..!

హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్‌ ఫీచర్లతో వన్‌ప్లస్‌ బ్యాండ్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు