Trucaller: ట్రూ కాలర్‌ కొత్త ఫీచర్స్‌ తెలుసా..?

ట్రూకాలర్‌..ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్‌. తాజాగా ఈ యాప్‌ యూజర్స్‌ కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్, స్మార్ట్‌ ఎస్సెమ్మెస్‌ ఫిల్టర్‌, ఇన్‌బాక్స్‌ క్లీనర్‌ వంటి ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి.

Published : 19 Jun 2021 11:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్రూకాలర్‌.. ప్రస్తుతం చాలా ఫోన్‌లో ఉండే యాప్‌. తాజాగా ఈ యాప్‌ యూజర్స్‌ కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్, స్మార్ట్‌ ఎస్‌ఎంఎస్‌ ఫిల్టర్‌, ఇన్‌బాక్స్‌ క్లీనర్‌ వంటి ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యూజర్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్స్‌ను పరిచయం చేసినట్లు ట్రూకాలర్‌ తెలిపింది. మరి ఈ ఫీచర్స్‌ ఎలా పనిచేస్తాయో చూద్దాం!

గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్ 

ఇందులో యూజర్ ఒకేసారి 8 మందితో గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. ఇది హై వాయిస్‌ క్లారిటీ కాలింగ్‌ అనుభూతిని యూజర్‌కి అందిస్తుంది. గ్రూప్‌ వాయిస్‌ కాలింగ్‌లో పాల్గొనే వారిలో స్పామ్‌ యూజర్స్‌ని గుర్తించి, తొలగించడంతో పాటు, కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని వ్యక్తులతో కూడా కాల్స్‌ మాట్లాడుకునే సదుపాయం ఉంది. కాల్‌ మధ్యలో అవతలి వ్యక్తులు ఆఫ్‌లైన్‌లో ఉన్నా యూజర్‌కి తెలియజేస్తుంది. అంతేకాకుండా కాల్స్‌లో పాల్గొనేవారి లొకేషన్‌ కూడా స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. భద్రతపరంగా కూడా ఈ గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ ఫీచర్‌కు సిమెట్రిక్‌ ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కల్పించినట్లు ట్రూకాలర్‌ తెలిపింది. 

స్మార్ట్‌ ఎస్‌ఎంఎస్‌ ఫిల్టర్‌

ఈ ఫీచర్‌ సాయంతో యూజర్స్‌ వాణిజ్యపరమైన స్పామ్‌ ఎస్‌ఎంఎస్‌లను సులభంగా గుర్తించొచ్చని ట్రూకాలర్ చెబుతోంది. రోజులో సగటున యూజర్‌ ఫోన్‌కి వచ్చే సందేశాల్లో 80 శాతం వాణిజ్యపరమైనవే ఉంటన్నాయనేది ట్రూకాలర్ వాదన. కొత్తగా తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఈ ఫీచర్, స్పామ్‌ కాలర్స్‌ను గుర్తించి వారి నుంచి వచ్చే సందేశాలను సులువుగా ఫిల్టర్‌ చెయ్యొచ్చు.

ఇన్‌బాక్స్‌ క్లీనర్‌

గతంలో ఫోన్‌ ఇన్‌బాక్స్‌లో ఉండిపోయిన స్పామ్‌ మెస్సెజ్‌లను తొలగించేందుకు ఈ టూల్‌ సాయపడుతుంది. యూజర్‌ ఒక్కసారి ఇన్‌బాక్స్‌ క్లీనర్‌ టూల్‌పై క్లిక్ చేస్తే పాత ఓటీపీ, స్పామ్‌ మెస్సెజ్‌లను చూపిస్తుంది. తరువాత క్లీన్‌అప్‌ బటన్‌పై క్లిక్‌ చేస్తే వాటిని తొలగిస్తుంది.  

ఈ మూడు కొత్త ఫీచర్స్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఐఓఎస్‌ యూజర్స్‌కి ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటికే ట్రూకాలర్‌ వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్స్‌ ఫోన్‌లో యాప్‌ని అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ మూడు ఫీచర్స్‌ని ఉపయోగించుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని